బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెరపైకి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎన్ని వచ్చినా ఒక్కో జానర్ లో ఒక్కో షో హైలైట్ అవుతుంటాయి. అలా తెలుగు రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ ముందంజలో ఉంటుంది. సినీ నటులతో, బుల్లితెర ఆర్టిస్టులతో పాటు సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న కామన్ పీపుల్ కూడా బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అయితే.. బిగ్ బాస్ షోలో ఎంతమంది సెలబ్రిటీలు పాల్గొన్నా కొంతమంది పాల్గొంటే బాగుంటుందని.. వారిని బిగ్ బాస్ లో చూడాలని జనాలు తెగ ఆరాటపడిపోతుంటారు. అలా బిగ్ బాస్ లో యాంకర్ రష్మీని చూడాలని కొద్దీ సీజన్స్ నుండి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటివరకు బిగ్ బాస్ షో ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన ఈ రియాలిటీ షోకి.. సెకండ్ హోస్ట్ గా హీరో నాని.. ఆ తర్వాత నాలుగు సీజన్ల నుండి కింగ్ నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. అయితే.. బుల్లితెరపై పాపులర్ అయిన గ్లామరస్ బ్యూటీలలో యాంకర్ రష్మీ ఒకరు. హీరోయిన్ అవ్వాలనే డ్రీమ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ, జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మారి ఫేమ్ సంపాదించుకుంది. తనకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిన అదే షోలో సుమారు పదేళ్లుగా కొనసాగుతోంది రష్మీ. ఓవైపు యాంకర్ గా రాణిస్తూనే, మరోవైపు ఆచితూచి సినిమాలు కూడా చేస్తోంది.
ఇక రష్మీ బిగ్ బాస్ లోకి రానుందనేది కొత్త విషయం కాదు. ఎందుకంటే.. షో మొదలైనప్పటి నుండే అమ్మడికి ప్రతిసారి పిలుపు వస్తూనే ఉందట. కానీ.. రెమ్యూనరేషన్ చాలకో.. లేదా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయేమో గానీ మొత్తానికి 6 సీజన్ల వరకు బిగ్ బాస్ లో అడుగు పెట్టలేదు. అయితే.. బిగ్ బాస్ కి ఇదివరకు ఉన్నంత క్రేజ్, బజ్ సీజన్ల వారీగా తగ్గుతూ వచ్చిందనే చెప్పాలి. గతంలో ఉన్న మసాలా లేక ఫాలోయర్స్ తగ్గిపోయారు. దీంతో మళ్లీ షోకి గ్లామర్ తళుకులు రావాలంటే యాంకర్ రష్మీని ఎలాగైనా తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకు రష్మీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఇప్పటికే రెండు మూడుసార్లు నిరాకరించిన రష్మీ.. ఈసారి ఏడో సీజన్ లో రానుందేమోనని అంచనా వేస్తున్నారు బిగ్ బాస్ ప్రియులు. సో.. చూడాలి.. రష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో! మరి రష్మీ బిగ్ బాస్ లోకి వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.