తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు భూమిక చావ్లా. దాదాపు ఓ దశాబ్ధం పాటు స్టార్ హీరోయిన్‌గా తెలుగు సినిమాను ఏలారామె. సుమంత్ హీరోగా నటించిన ‘యువకుడు’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చారు. తెలుగులో టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. బ్లాక్ బాస్టర్ హిట్లను సైతం అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. ఆమె తాజాగా ‘సీతా రామమ్’సినిమాలో సుమంత్ భార్యగా నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక, భూమిక కుటుంబం విషయానికి వస్తే..
కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు, యోగా టీచర్ అయిన భరత్ ఠాకూర్‌తో జీవితాన్ని పంచుకున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. భూమిక తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కుటుంబంతో టైమ్‌ను ఆస్వాధించటానికి ఇష్టపడుతుంది. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడుపుతుంది. తాజాగా, భూమిక తన ఫ్యామిలీతో దీపావళి పండుగను జరుపుకున్నారు. ఆ సెలెబ్రేషన్స్ తాలూకా ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఈ సంవత్సరం దీపావళి’ అని రాసుకొచ్చారు. ఆ ఫొటోల్లో భర్త, కుమారుడితో కలిసి ఉన్నారామె. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Diwali this year ✨🪔 ✨ pic.twitter.com/f3vxBEyngJ
— Bhumika Chawla — Just B (@bhumikachawlat) October 27, 2022