దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి కపిల్ శర్మ కామెడీ షో చూసేవారికి అందులో కనిపించే లేడీ కమెడియన్ భారతీ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న భారతీ.. కపిల్ శర్మ షో ద్వారానే దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.
ఈ పంజాబీ బ్యూటీ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం రోజు(ఏప్రిల్ 3న) భారతీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2017లో ప్రముఖ టీవీ హోస్ట్ హార్ష్ లింబాచియాను ప్రేమించి పెళ్లాడిన భారతీ.. తాజాగా కొడుకు పుట్టిన శుభవార్తను భర్తతో కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ శుభ సందర్భంగా మాకు బాబు పుట్టాడని చెప్పడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు భారతీ – హార్ష్.
ఇక ప్రస్తుతం ఈ దంపతులు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు భారతీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ నుండి కరణ్ జోహార్, పరిణీతి చోప్రా, సింగర్ నేహా కక్కర్, నటి హస్సానందిని, అష్నూర్ కౌర్, ఈషా గుప్తా అధితి భాటియా తదితరులు కామెంట్స్ లో విష్ చేశారు.
ఇదిలా ఉండగా.. భారతీ సింగ్ కేవలం కపిల శర్మ షో మాత్రమే కాకుండా హిందీలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తోంది. కామెడీ సర్కస్, ఝలక్ దిక్లాజా, బిగ్ బాస్, నాచ్ బలియే, ఖత్రోన్ కే ఖిలాడీ, డ్యాన్స్ దీవానే తదితర రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. కామెడీ షోల ద్వారా బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. దీంతో పాటు కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది.