టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, పోటీకి ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ అవుతుండాలి. హీరో సినిమా- సినిమాకి ఎంత గ్యాప్ తీసుకుంటే తన కెరీర్ అంత వెనక్కి వెళ్తుంటుంది. ఎప్పుడూ బిజీగా ఉండాలి, సంవత్సరానికి ఒక్క సినిమా అయినా రిలీజ్ కావాలనుకునే వారిలో ఎన్టీఆర్ కూడా ఉంటాడు. కానీ, ఈసారి సూత్రం తప్పింది. జక్కన్న- RRR సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా తన కెరీర్లో మూడేళ్లు పణంగా పెట్టాడు. ఈ మూడేళ్లలో మరే ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. 2018లో అరవింద సమేత తర్వాత మళ్లీ ఇప్పటి దాకా తారక్ స్క్రీన్ మీద సందడి చేసింది లేదు.
RRR కారణంగా తారక్ బాగానే లాస్ అయ్యాడని తెలుస్తోంది. సాధారణంగా గతంలో ఒక సినిమా అంటే ఎన్టీఆర్ రూ.30 కోట్లు వరకు తీసుకునేవాడు. ఇప్పుడు ఆ గ్రాఫ్ రూ.50 కోట్లకు చేరింది. 2018 తర్వాత 2019, 2020, 2021 సంవత్సరాలు తారక్ కేవలం RRR సినిమా కోసమే కేటాయించాడు. రామ్ చరణ్ అయినా మధ్యలో ఆచార్య సినిమాలో చేశాడు. కానీ, తారక్ మాత్రం మరే ప్రాజెక్టుకు ఓకే చెప్పకుండా అలాగే ఉండిపోయాడు.
#RoarOfRRRInMumbai Event Telecast from 11 PM today on @zeecinema & @ZeeTV!! #RRRMovie pic.twitter.com/dN9DApJv0r
— RRR Movie (@RRRMovie) December 31, 2021
ఇప్పుడు ఆ కారణంగానే ఎన్టీఆర్ దాదాపు రూ.150 కోట్ల మేర నష్టపోయాడు అంటూ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మరోవైపు ఆ గ్యాప్ పూడ్చడానికే కొరటాల, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ప్రాజెక్టులను వరుసగా పట్టాలెక్కించేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని వెండితెరపై చూసి మూడు సంవత్సరాలైంది. ఈ గ్యాప్ మొత్తాన్ని RRR ఫిల్ చేస్తుందని భావిస్తున్నారు. తర్వాతి ప్రాజెక్టులు మాత్రం ఈ రేంజ్ గ్యాప్ రాకూడదని తారక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. RRR ప్రాజెక్టు ఎన్టీఆర్ కు లాభమా, నష్టమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.