సినీ ఇండస్ట్రీకి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నటులలో బండ్ల గణేష్ ఒకరు. ఎల్లప్పుడూ ఏదొక పోస్ట్ ద్వారా హాట్ టాపిక్ అవుతుంటాడు. తాజాగా మెగా అభిమాని ట్వీట్ పై స్పందించి మరోసారి వార్తల్లో నిలిచాడు. బండ్ల గణేష్ కి మెగా ఫ్యామిలీపై.. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. పవన్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా బండ్ల ఊగిపోతుంటాడు.
ఇక ఇటీవలే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో రాబోయే ఎన్నికల్లో అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి రావాలని ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు అహర్నిశలు పాటుపడుతున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా మెగా అభిమాని ఒకరు.. “చిరంజీవి గారు జనసేన లోకి రావాలి పార్టీని అధికారంలోకి తేవాలి. మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించాలి. అంధకారంలో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలి. రాముడులోని సౌమ్యం మీరు.. లక్ష్మనుడి లోని తెగింపు తమ్ముడిది. ఇద్దరు కలిస్తే శ్రీరామరాజ్యం అవుతుంది. జై జనసేన జై పవన్ కళ్యాణ్’ అని ట్వీట్ చేశాడు.అభిమాని ట్వీట్ పై బండ్ల రియాక్ట్ అవుతూ.. “మరి నేను?” అంటూ తన స్థానం ఏంటని అడిగాడు. ఇక గణేష్ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘నువ్ హనుమంతుడివి అన్నా.. నువ్వెప్పుడూ మా గుండెల్లో ఉంటావ్’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మెగా అభిమాని ట్వీట్, బండ్ల గణేష్ రీట్వీట్ వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ పవన్ పార్టీలోకి రావడం సాధ్యమేనా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మెగా ఫ్యాన్స్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.
మరి నేను ? https://t.co/5fvWCt4VeK
— BANDLA GANESH. (@ganeshbandla) March 30, 2022