బాలయ్య ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ లెవల్స్ వేరే లెవల్లో ఉంటాయి. ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన.. తాజాగా ‘వీరసింహారెడ్డి’తోనూ అంతకు మించిన కలెక్షన్స్ సాధిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. వసూళ్లకు మాత్రం దానితో సంబంధం లేదు. తొలి నాలుగు రోజుల్లోనే రూ.104 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ప్రస్తుతం లాభాల్లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం.. ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ లోనూ బాలయ్య తన మార్క్ ఉత్సాహంతో కనిపించారు.
ఇక విషయానికొస్తే.. బాలయ్యకు సరైన ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ పడితే ఎలా ఉంటుందనేది ‘వీరసింహారెడ్డి’ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో బాలయ్య మార్క్ యాక్షన్, ఫైట్ సీన్స్ ఉండేసరికి ఫ్యాన్స్ అయితే గోల గోల చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ కు ‘వీరసింహారెడ్జి’ టీంతో పాటు విశ్వక్ సేన్, సిద్ధు లాంటి యంగ్ హీరోలతో పాటు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ కూడా అటెండ్ అయ్యారు.
ఇక ఈవెంట్ అంతా తెగ సందడిగా జరిగింది. దీని తర్వాత అందరూ కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని హీరో విశ్వక్ సేన్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఓ పిక్ లో బాలయ్య, ‘వీరసింహారెడ్డి’ హీరోయిన్ హనీరోజ్… కిరాక్ పోజులో కనిపించారు. ఇద్దరి చేతుల్లో డ్రింక్ గ్లాసులు కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక ఫ్యాన్స్ అయితే.. ‘చేతిలో గ్లాసు.. పక్కన హనీరోజు’ అని ప్రాసతో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సరే బాలయ్య పిక్ మాత్రం అభిమానులకు తెగ కిక్ ఇస్తోంది. మరి ఈ ఫొటో చూడగానే మీకు ఏం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
#NandamuriBalakrishna & #HoneyRose Celebrating #VeeraSimhaaReddy Success 🥂 pic.twitter.com/jgpiujOID0
— SumanTV (@SumanTvOfficial) January 23, 2023