ఫిల్మ్ డెస్క్- సినిమా వాళ్ల గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. ఇక తమ అభిమాన నటీ, నటుల గురించిని విషయాల గురించి ఐతే మరింత ఇంట్రస్ట్ చూపిస్తారు. వాళ్లు ఎక్కడ ఉంటారు, ఏం తింటారు వంటి చాలా అంశాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇదిగో ఇటువంటి సమయంలో నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు సీనియర్ నటుడు సుభలేఖ సుధాకర్. సాధారనంగా బాలకృష్ణ కు కోపం ఎక్కువని, అప్పుడప్పుడు అభిమానులపై చేయి చేసుకుంటారని అందరికి తెలుసు. కానీ శుభలేఖ సుధాకర్ చెప్పిన విషయాలు వింటే మాత్రం బాలకృష్ణలో మరో కోణం కనిపిస్తుంది. బాలకృష్ణ మనసు వెన్న అని, ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వమని కొన్ని సందర్బాల్లో విన్నాం. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం ఆయనకు చేతకాదని, రీల్ లైఫ్‌లో నటించినట్టుగా రియల్ లైఫ్‌లో ఆయన నటించరని ఇప్పటికే చాలా మంది చెప్పారు.
ఐతే బాలకృష్ణతో శుభలేఖ సుధాకర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీళ్లిద్దరు మంచి స్నేహితులు. బాలయ్య బాబు, శుభలేఖ సుధకర్ రెగ్యులర్ గా కలుస్తుంటారు. దీంత బాలకృష్ణ గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. బాలయ్య బాబు చాలా లవ్ లీ పర్సన్ అని, ఆయన మనసు చిన్న పిల్లాడి మనసని అన్నారు. రీల్ లైఫ్‌లో ఒకలా, రియల్ లైఫ్‌లో ఒకలా ఆయన ఉండరని చెప్పారు. మనకి బాలయ్య ఎలా కనిపిస్తారో అదే నిజమని శుభలేఖ సుధకార్ చెప్పుకొచ్చారు. ఇక బాలకృష్ణకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువని, కలిసినప్పుడల్లా ఎన్టీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారని తెలిపారు. అంతే కాదు బాలయ్య బాబుకు భక్తి ఎక్కువని, పూజలు ఎక్కువగా చేస్తుంటారని చెప్పారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేవారని శుభలేక సుధకార్ గుర్తు చేశారు.
ఇక బాలకృష్ణ, తాను సమయం చిక్కినప్పుడల్లా మందు తాగుతామని ఓపెన్ గా చెప్పారు సుధాకర్. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. తాను కాస్త ఖరీదైన మందు బ్లాక్ లేబుల్ తాగితే, బాలయ్య బాబు మాత్రం కేవలం మాన్షన్ హౌజ్ బ్రాండ్ మందు మాత్రమే తాగుతారని చెప్పుకొచ్చారు. ఇందుకు ఆయన ఏ మాత్రం సిగ్గుపడరని, తనకు నచ్చిన మందు తాను తాగుతానని సింపుల్ గా చెబుతారని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద వాళ్లు మందు తాగినా అలవాటు లేనట్లుగా బిల్డప్ ఇస్తుంటారని, కానీ బాలకృష్ణ ఒక్కరే నిజాయితీగా తన అలవాట్లను సైతం ఓపెన్ గా చెబుతారని శుభలేఖ సుధాకర్ చెప్పారు. అందుకే తనకు బాలయ్య బాబు అంటే చాలా ఇష్టమని అన్నారు.