ఆరు పదుల వయసులో కూడా కుర్రాడిలా ఫుల్ జోష్‌గా.. ఎంతో ఉత్సాహంగా.. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే.. హైపర్ యాక్టీవ్‌గా ఉంటాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సినిమాల సంగతి పక్కకు పెడితే.. రియల్ లైఫ్‌లో బాలయ్య అంత బోళా మనిషి మరొకరు ఉండరు అంటారు. తోటి నటులతో ఆయన కలిసిపోయే తీరు అద్భుతమని ప్రశంసలు కురిపిస్తారు. ఇక అన్‌స్టాపబుల్ షో.. బాలయ్యలోని కొత్త మనిషిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక బాలయ్య స్టేజీ ఎక్కితే ఆయన మాటల ప్రవాహాన్ని అడ్డుకోవడం కష్టం. ఎలాంటి భేషజాలు లేకుండా.. స్టేజీ మీద అల్లరి అల్లరి చేస్తాడు బాలయ్య. పాటలు, డైలాగ్‌లు ఇలా ఏం చేసినా బాలయ్య రూటే సపరేటు. ఎలాంటి మొహమాటానికి పోకుండా.. తనకు నచ్చినట్లు ఉంటాడు బాలయ్య. ఇక తాజాగా స్టేజీ మీదే బూతులు మాట్లాడి.. అందరికి షాకిచ్చాడు బాలయ్య. మరి ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకంది అంటే..
సంక్రాంతి సందర్భంగా బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం నాడు వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కుర్ర హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నల గడ్డ, దర్శకుడు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి వంటి వారు వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడిన కొన్ని మాటలు, పాడిన పాటపై ప్రస్తుతం నెట్టింట జోరుగా విమర్శలు వస్తున్నాయి.
వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా బాలయ్య స్టేజీ మీద మాట్లాడుతూ.. ముందుగా విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత ఇక్కడ ముందు హిందీలోనే పలకరిస్తారు అని తెలిపి.. తాను కూడా నిజాం కాలేజ్‌లో చదువుకున్నానని, ఆ టైంలో హిందీలో మాట్లాడేవాడిని అంటూ.. తనకు వచ్చిన బూతులను బయటపెట్టేశాడు. ఆ మాటలు విని స్టేజీ మీద ఉన్నవారు నవ్వుతూ చప్పట్లు కొట్టారు.
అయితే సాధారణంగా ఫ్రెండ్‌షిప్ కొద్ది ఎవరైనా చనువుగా అలా పలకరించుకుంటారు. నలుగురిలో అయితే పర్లేదు కానీ బాలయ్య మాత్రం స్టేజీ మీదే అలా యధేచ్చగా ఆ పదాలను వాడటంతో.. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి బాలయ్య అలా స్టేజీ మీదే బూతులు మాట్లాడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.
Arey 🤣🤣🤣🤣 pic.twitter.com/pqAl1iMpII
— Better Call Saul (@Saul_Goodmannnn) January 22, 2023