Rithu Chowdhary: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న ప్రతి ఒక్కరూ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలన్నీ సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటున్నారు. సినీ స్టార్స్ నుండి సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వరకు అందరూ సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు. పర్సనల్ విషయాలు, ప్రేమ, పెళ్లి వార్తలను కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా బాయ్ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేసి వార్తల్లోకెక్కింది బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి.
టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయినటువంటి రీతూ చౌదరి.. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టింది. యాంకర్ ప్రదీప్ పెళ్లిచూపులు ప్రోగ్రాంతో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ.. గోరింటాకు అనే సీరియల్ ద్వారా నటనలో జర్నీ మొదలుపెట్టింది. అక్కడినుండి వరుసగా సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం సీరియల్స్ లో కీలకపాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ క్రమంలో అడపాదడపా సినిమాలలో సైతం మెరిసిన రీతూ.. యూట్యూబ్ లో సొంత ఛానల్ పెట్టి వ్లాగ్స్ చేస్తుంటుంది. ఇక బుల్లితెర పాపులర్ కామెడీ షోలైన శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లలో కామెడీ స్కిట్స్ చేస్తూ లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంటుంది. ఈ షోలు, సీరియల్స్ గురించి పక్కన పెడితే.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ అని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లుగా పోస్ట్ పెట్టింది. కాబోయే భర్త శ్రీకాంత్ తో కలిసి ఫోటో షేర్ చేసిన రీతూ.. తమ బంధం కంటే ఏదీ బెటర్ కాదని క్యాప్షన్ జోడించింది. అయితే.. రీతూ ఈ పోస్ట్ పెట్టినప్పటి నుండి ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్.
తాజా సమాచారం.. రీతూ బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్.. రాజకీయ నేపథ్యం, ఆస్తిపాస్తులు కలిగిన ఫ్యామిలీకి చెందిన వాడని తెలుస్తుంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉండగా.. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రీతూ చౌదరి, శ్రీకాంత్ ల జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Rithu x #Srikanth pic.twitter.com/raIL6cXxDA
— Hardin (@hardintessa143) July 16, 2022