తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా, విలక్షణ నటుడిగా తన నటనతో ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు బాబు మోహన్. గత కొన్నేళ్ల నుంచి ఆయన సినిమాల్లో కనిపించకపోవడ విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్ గా పలు సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో విలక్షణమైన పాత్రలో నటించి మెప్పించారు. బాబు మోహన్ సినిమాల్లోనే కాకుండా తన పాత్రను రాజకీయాల్లో కూడా నడపించారు.
మొదట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన మారిన రాజకీయ పరిస్థితుల నడుమ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. ఇక విషయం ఏంటంటే? ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని బాబు మోహన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్దదిక్కు ఎవరూ లేరని, ఉన్నా అందులో కొందరు పైపైన పట్టించుకుంటున్నారని, కొందరైతే అస్సలు పట్టించుకోవడం లేదంటూ బాబు మోహన్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Karate Kalyani: మరోసారి పోలీసులను ఆశ్రయించిన కరాటే కల్యాణి.. చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు!ఇక ఇదే కాకుండా ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నకలపై కూడా బాబూ మోహన్ తనదైన శైలిలో స్పందించారు. బెంగళూరులో పుట్టిన వారు, చెన్నైలో పుట్టిన వారు వచ్చి మా ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటని ప్రకాష్ రాజ్ పై బాబు మోహన్ పై ఇండైరెక్ట్ గా చురకలించాడు. ఇది కాక చెన్నైలో తెలుగు వాళ్లని ఎన్నుకోమనండి చూద్దాం? అంటూ కూడా బాబు మోహన్ ప్రశ్నించారు.
బెంగళూరులో తెలుగు సినిమాలనే ఆడనీయరని, అక్కడ పుట్టినోడు ఇక్కడ ‘మా’ ప్రెసిడెంట్ కావచ్చా అంటూ బాబు మోహన్ సూటిగా ప్రశ్నించారు. మా సభ్యులు ఎవరిని గెలిపించాలో వారినే గెలిపించారని బాబు మోహన్ తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో జరిగిమా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ పై పరోక్షంగా స్పందించిన బాబు మోహన్ పై వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామంట్స్ రూపంలో తెలియజేయండి.