ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన అవతార్ 2 ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. శుక్రవారం థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా విజువుల్ వండర్‌కు అమ్మలా ఉందని అంటూ జనం వేనోళ్ల కొనియాడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మేనియా స్పష్టంగా కనిపించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా థియేటర్ల ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాల్లో ఉండింది. దీన్ని బట్టే అర్థం అయిపోతుంది. అవతార్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తున్నారో. ఇక, కలెక్షన్ల పరంగా కూడా అవతార్ 2కు తెలుగు ప్రేక్షకులు సరికొత్త రికార్డును కట్టబెట్టారు. ముందెన్నడూ ఓ హాలీవుడ్ డబ్బింగ్ సినిమాకు ఇవ్వనన్ని డబ్బుల్ని ఇచ్చారు. అవతార్ 2 సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 13.65కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించింది. ఏరియా వ్యాప్తంగా చూసుకుంటే నిజాంలో 7.05 కోట్లు, సీడెడ్‌లో 1.80, ఆంధ్రాలో 4.80 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా అవతార్ సంచలనాన్ని సృష్టించింది. మొదటి రోజు దాదాపు 40 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అయితే, పాత రికార్డులను మాత్రం తిరగరాలేకపోయింది. 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా మొదటి రోజు 53 కోట్ల రూపాయల కలెక్షన్లతో మొదటిస్థానంలో ఉంది. ఇక, ఈ సినిమా రికార్డులను అవతార్ దాటలేకపోయింది. రెండో స్థానానికే పరిమితం అయ్యింది. అవతార్‌కు నార్త్‌లో కంటే సౌత్‌లో ఎక్కువ పాపులారిటీ ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఏకంగా 30 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.