ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. జేమ్స్ కామెరాన్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కిన ఈ వండర్.. సినీ అభిమానులను మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. సుమారు 9 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లూ సాధించి.. సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మళ్లీ 9 తర్వాత.. అవతార్ 2తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా.. ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం అవతార్ ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో, ఆశ్చర్యానికి గురిచేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ తెరకెక్కింది.
జేమ్స్ కామెరాన్ మరోసారి ప్రేక్షకులను ‘పండోరా’ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఈసారి యుద్ధం నీటి అడుగున జరగబోతోంది. నీటి అడుగున దృశ్యాలు.. సముద్రంపై పండోరా ప్రయాణం.. యుద్ధ దృశ్యాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక వీటిని బిగ్ స్క్రీన్ మీద అందునా.. 3డీలో చూస్తే ఆ అనుభూతే వేరు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇండియాలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరీ అవతార్ 2 ఎలాంటి రికార్డులు క్రియేట్ చూస్తుందో చూడాలి.