మీరు మూవీస్ ఎక్కువ చూస్తారా? అయితే ఈ వారం నెక్స్ట్ లెవల్ రచ్చ చేయడానికి సిద్ధమైపోండి. ఎందుకంటే ఈ వారం ఏకంగా 30 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా?
మార్చి చివరికొచ్చేశాం. ఎగ్జామ్స్ హడావుడి కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. దీంతో ఈ వారంతో పాటు వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. బయటకెళ్లి తిరిగే ఇంట్రెస్ట్ లేనివాళ్లు.. కొత్త సినిమాలు ఏమేం రిలీజ్ అవుతున్నాయా? అని చూస్తున్నారు. అలాంటి వాళ్లకోసమా అన్నట్లు ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 30 సినిమాలు రాబోతున్నాయి. వాటిలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయండోయ్. ఇంగ్లీష్-హిందీ మూవీస్-వెబ్ సిరీసులు ఎలానూ ఉండనే ఉన్నాయి. మరి ఈ సంగతేంటి కాస్త చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి సోమవారం చాలామంది ఆఫీసులకు వెళ్తారు. సినిమా ప్రేమికులు మాత్రం ఈ వారం కొత్త సినిమాల సంగతేంటా? అని చూస్తారు. థియేటర్ తోపాటు ఓటీటీల్లో ఏవి రిలీజ్ అవుతున్నాయి. వాటిని ఎప్పుడెప్పుడు చూడాలి అని ప్లాన్ వేసుకుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈసారి 30 సినిమాలు రాబోతున్నాయి. వీటిలో అవతార్ 2 రెంట్ విధానంలో అందుబాటులోకి వస్తోంది. ‘అమిగోస్’, ‘శ్రీదేవి శోభన్ బాబు’, ‘సత్తిగాని రెండెకరాలు’, ‘డియర్ మేఘ’ లాంటి తెలుగు మూవీస్ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అలానే షెహజాదా, గ్యాస్ లైట్ లాంటి హిందీ సినిమాలు కూడా కాస్తకూస్తో ఆసక్తి కలిగిస్తున్నాయి. అదే టైంలో తెలుగులోనూ ‘గోదారి’ అనే డాక్యుమెంటరీ ఓటీటీలో ఈవారమే విడుదల కాబోతుంది.