ఆస్కార్ వేడుక ప్రపంచమెచ్చే రీతిలో జరిగింది. ఇందులో బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలు, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి అవన్నీ కూడా ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
ఆస్కార్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి తెలుగువాళ్లకు చాలా అంటే చాలా స్పెషల్. దానికి కారణం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాట నామినేషన్స్ లో ఉండటం. అయితే అవార్డు గెలుచుకోవడం అనేది టాలీవుడ్ తో పాటు మనకు దొరికిన బోనస్. ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’.. భారతీయులు ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేస్తోంది. తొలిసారి ఓ తెలుగు పాటకు ఈ గౌరవం దక్కడంతో చరిత్ర సృష్టించినట్లయింది. అయితే ఈసారి ఆస్కార్ లో బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలు కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
ఇక విషయానికొస్తే.. ప్రతి ఏడాది ఆస్కార్ వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. అందులో బెస్ట్ పిక్చర్ గా అవార్డు గెలుచుకున్న సినిమాని ఎలానూ కచ్చితంగా చూస్తారు. అలానే నామినేషన్స్ లో నిలిచిన మిగతా చిత్రాలను చూసేందుకు మూవీ లవర్స్ తెగ ఇష్టపడతారు. అయితే ఇవన్నీ కూడా ఏయే ఓటీటీల్లో అందుబాటులో ఉంటాయనేది కాస్త శ్రమతో కూడిన పని. అయితే మీకు అలాంటి ఇబ్బందేం లేకుండా మొత్తం మూవీస్ లిస్ట్, అవి ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయనేది కింద చెప్పాం. అలానే కొన్ని చిత్రాలు రెంట్ విధానంలో అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది సౌలభ్యంగా ఉంటే అందులో ఈ మూవీస్ ని టైమ్ చూసుకుని వీక్షించండి. అవి నచ్చితే నలుగురికి చెప్పండి. దిగువన కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.