డబ్ స్మాష్ వీడియోలతో ప్రారంభించి.. ఆ తర్వాత టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ తో పాపులారిటీ సంపాదించుకుని.. బిగ్ బాస్ షోతో అందరికి పరియం అయ్యింది అషూ రెడ్డి. పలు షోలతో బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ భామ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొనబోతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ నిర్వహించిన అషూ ఈ విషయాన్ని తనే లీక్ చేసింది. ఇన్‌స్టా లైవ్‌లో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ జెస్సీతో ముచ్చటించింది అషూ.
ఇది కూడా చదవండి : వీడియో వైరల్: యాంకర్ రవికి ముద్దిస్తానన్న అషు రెడ్డి..!
ఈ సందర్భంగా జెస్సీ తన సినిమా అప్‌డేట్స్ చెప్పుకురాగా.. బయటకు వచ్చాకే నీ సినిమా చూస్తాను జెస్సీ అంటూ బిగ్‌బాస్ ఓటీటీలోకి వెళ్తున్నట్లు రివీల్ చేసింది అషూ. ఆ తర్వాత నాలుక కర్చుకుంది. అషూ మాటలు విన్న జెస్సీ.. దీన్నే నోటిదూల అంటారని సెటైర్ వేశాడు. ఇక లైవ్ సెషన్‌లో నెటిజన్లు చిత్రవిచిత్ర ప్రశ్నలతో అషూను ఆడుకున్నారు. అషూ, మనం లేచిపోదాం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక ఓకే చిల్ అని రిప్లై ఇచ్చింది అషూ రెడ్డి. ప్రసుత్తం వీరద్దరి మధ్య జరిగిన చాటింగ్ తెగ వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.