తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుపరిచితమే. ఇప్పుడు తన కూతురు ఐశ్వర్యని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ.. స్వీయ నిర్మాణంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అయితే.. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ని ప్రకటించాడు. అలాగే మూవీ ఓపెనింగ్ కూడా ఎంతో లాంఛనంగా చేశాడు. అయితే.. హీరో విశ్వక్ సేన్ కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్ ని వాయిదా వేశానని, విశ్వక్ వల్ల తన టీమ్ కి అవమానం జరిగిందని చెప్పి.. వేరే హీరోతో సినిమా చేస్తానని ఇటీవల ప్రెస్ మీట్ లో తెలిపాడు.
ఈ క్రమంలో అర్జున్ ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఇండస్ట్రీకి నేను వచ్చి నాలుగు దశాబ్దాలు అవుతుంది.. ఇప్పటివరకు ఎవరితోనూ ఏ ఇబ్బంది పడలేదు. కానీ, మొదటిసారిగా హీరో విశ్వక్ సేన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. విశ్వక్ అన్ ప్రొఫెషనల్ యాక్టర్ అని మండిపడ్డాడు. దీంతో విశ్వక్ తో తాను సినిమా తీసే ప్రసక్తి లేదని తేల్చేశాడు. దీనిపై స్పందించిన విశ్వక్.. ‘నా క్యారెక్టర్ ఎలాంటిదో సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. నేను ఎంతో నిబద్దతో పనిచేస్తాను. దిల్ రాజు, సురేష్ బాబు లాంటి స్టార్ ప్రొడ్యూసర్లతో పనిచేశాను. నన్ను ఎవరైనా అన్ ప్రొఫేషనల్ అంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.. అంటూ అర్జున్ కి క్షమాపణలు చెప్పాడు.
వీరి వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తుండగా.. మరోవైపు అర్జున్ తన సినిమా కోసం విశ్వక్ స్థానంలో కొత్త హీరోని ఎంపిక చేసుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. తనను నమ్ముకొని వచ్చిన టెక్నీషియన్స్ ని వెనక్కి పంపే ఆలోచన లేదని.. ఎట్టిపరిస్థితుల్లో ఈ మూవీని తీస్తానని చెప్పినట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం.. అర్జున్ తన సినిమాలో శర్వానంద్ ని హీరోగా అనుకుంటున్నాడట. ఇప్పటికే శర్వానంద్ తో సంప్రదింపులు కూడా జరిపాడని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ మూవీతో హిట్ కొట్టాడు. సో.. చూడాలి మరి ఈ సినిమా ఓకే చేస్తాడో లేదో!