అరియనా గ్లోరీ పరిచయం అవసరం లేని పేరు. గ్లామర్ ఒలకపోతలో, కుర్రాళ్లకు ఉక్కబోత పెట్టించడంలో ఈమెకు సరిలేరు మరెవ్వరు అనేలా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సెలబ్రిటీలు ఏమైనా వాయిదాల పద్ధతిలో గ్లామర్ ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారో ఏమో. వాయిదాల పద్ధతిలో వలపుల బాణాలు విసురుతున్నారు. మొదట్లో ఏదో సోసోగా గ్లామర్ షో ప్రదర్శించే సెలబ్రిటీలు.. కొన్ని రోజుల తర్వాత గ్లామర్ షోలో మాస్టర్స్ చేసినట్టే టాలెంట్ చూపిస్తుంటారు. ఏదో చిట్టీ పాట వేసినప్పుడు.. చివరాఖరున పాట పడుకుంటే ప్రతి నెలా వడ్డీ కలిసినట్టు.. ఈ అరియనా గ్లామర్ ట్రీట్ విషయంలో కూడా రోజురోజుకు ఇంట్రస్ట్ పెంచేస్తుంది. గ్లామర్ ఇంట్రస్ట్ పెరిగితే.. నెటిజన్ల ఇంట్రస్ట్ పెరక్కుండా ఎలా ఉంటుంది చెప్పండి.
అమ్మాయి గోరు గ్లామర్ ఫోటోలు ఇలా పెట్టగానే అలా లైకులు చేసేస్తారు అబ్బాయి గోర్లు. అలాంటిది ఈసారి అరియనా గ్లామర్ షో ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని తన గ్లామర్ షోతో మాట్లాడుతుంది. గ్లామర్ బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తూ గ్లామరసాలతో పరవళ్లు తొక్కుతుంది. ఆ గ్లామరస ప్రవాహంలో కుర్రాళ్ళు కొట్టుకుపోయేలా ఉన్నారు. ఈమె అందానికి ముగ్ధులైన కుర్రాళ్ళు కవి సార్వ భౌములు కాకుండా ఉంటారా? ఈ అందగత్తెని గ్లామరస సార్వ భామ అని కొనియాడకుండా ఉంటారా? అరియానా బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు చూస్తుంటే.. నల్ల త్రాచులా కాటేసేలా కనబడుతోంది.
పాలకులకి, ప్రజలకి మధ్య పారదర్శకత ఉండాలన్న సూత్రాన్ని వంటబట్టుకుంది కాబోలు.. తన అభిమానులకి, తనకి మధ్య పారదర్శకత ఉండాలని ఇలా ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో కనువిందు చేసింది. అరియనా గ్లామర్ షోకి కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇలా ఐతే ఎలా అరి అని అరిచి గీపెడుతున్నారు. ఆమె తన గ్లామరస ప్రవాహాన్ని ఆపదు, ఆమెపై అభిమానుల కవిత్వరస ప్రవాహం ఆగదు. అరియనా సోకుల సామ్రాజ్యానికి యువరాణి. సోకుల సునామీలు తన అస్త్రాలు. అరియనా డిసైడ్ ఐతే వార్ వన్ సైడే. ఆమె గ్లామర్ కి ఎదురెళ్ళినా నెటిజన్ కే రిస్కు.. ఆమె మనకి ఎదురొచ్చినా మనకే రిస్క్. గ్లామర్ తో తొక్కి పడేస్తుంది. మాస్.. ఊర మాస్ అరియనా.
సినిమాల్లో హీరో చేయకూడని పనులు చేసి.. చివర్లో మెసేజ్ ఇచ్చినట్టు.. అరియనా కూడా ఒక మెసేజ్ ఇచ్చిందండోయ్. ఘాటైన ఫోటోలు పెట్టి.. ఒక సందేశాన్ని ఇచ్చింది. ‘ప్రపంచాన్ని మార్చుకోవడానికి మనకి మంత్రాలు, మాయలు అవసరం లేదు. మనకు కావాల్సిన శక్తినంతా మనలోనే మనం ఆల్రెడీ క్యారీ చేస్తున్నాం’ అంటూ ఒక షిక్కటి సందేశాన్ని ఇచ్చింది. మరి ఘాటుగా గ్లామర్ ఒలకబోస్తూ.. సందేశం సాఫ్ట్ గా ఇస్తే జనం తీసుకుంటారా? అనేది పెద్ద కొచ్చిన్ మార్కు. కొచ్చిన్ మార్కు, ఆన్సర్ షీటు పక్కన పెడితే.. అరియనా హైవోల్టేజ్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ కి కుర్రాళ్ళకి ఫుల్ కిక్ ఇస్తుందని సోషల్ మీడియాలో పెద్ద టాకు.