అరియానా గ్లోరి…వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది అరియనా. ఇదే ఇంటర్వ్యూతో ఈ అమ్మడు ఓ రేంజ్ కి దూసుకెళ్లింది. ఈ దెబ్బతో బిగ్ బాస్ కి సైతం సెలక్ట్ అయ్యింది అరియనా. ఇక అందులోను తన సత్తా ఏంటో చూపించి ఫైనల్ వరకు వెళ్లే ప్రయత్నం కూడా చేసింది. బిగ్ బాస్ ద్వారా తన లేలేత అందాలతో ప్రేక్షకులను కనువిందు చేస్తూ కాంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ అనంతరం ఈ అమ్మడు తన కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది అరియానా. ఈ ఇంటర్వ్యూతో ఈ భామ సంచలనాలకు తెర తీసింది. వర్మతో చేసిన ఈ ఇంటర్వ్యూలో ఏకంగా బికినితో దర్శనమిచ్చి అందరిని షాక్ కు గురిచేసింది. ఇందులో వర్మ అడిగే బోల్డ్ ప్రశ్నలకు తడబడకుండా సమాధానం ఇచ్చి తనేంటో తెలిపింది ఈ బ్యూటీ.
తన అందం అభినయంతో యంగ్ యాంకర్లకు గట్టి పోటీని ఇస్తూ సవాల్ విసురుతోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే ఈ సుందరి తాజాగా తన అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఇటీవల తన ఇన్ స్ట్రా గ్రామ్ లో కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది అరియానా. ఇందులో బ్లాక్ డ్రెస్ తో కనిపించి తన అందాలతో అందరిని వావ్ అనిపిస్తోంది.
సన్నని జారీపోయే నడుముతో యువతను మతి పోగోట్టేందుకు తెగ ప్రయత్నాలు చేసి పనిలో నిమగ్నమైంది. సొగసులను ఆరబోస్తూ యువకుల గుండెల్లో స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. అవకాశాలను అంది పుచ్చుకునేందుకు ఈ సుందరి తన అందాన్ని ఎరగా వేస్తోందనే చెప్పాలి. ఇప్పటికే కొన్ని సీరియల్లో అవకాశాలను కూడా రాబట్టుకుంటోంది అరియానా.
ఇక సమయం దొరికినప్పుడల్లా ఫోటో షూటికి పని చెబుతోంది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను అందుకునేందుకు అరియనా చేయని ప్రయత్నం లేదు. ఇక తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంటూ తన ఫాన్స్ ని ఖుషి చేస్తోంది ఈ బ్యూటీ. ఇక రానున్న రోజుల్లో ఈ అందాల యాంకర్ ఇంకెన్ని అవకాశాలను అందుకుంటుందో చూడాలి మరి.