“అఖిల్” టాలీవుడ్ లో అక్కినేని వారసత్వాన్ని కొనసాగించే నవ మన్మథుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. టాలీవుడ్ కింగ్ గా పేరున్న నాగార్జున.. తండ్రిగా మంచి మార్గం వేసినప్పటికీ, అఖిల్ ఇంకా సినిమాల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. మొదటి సినిమాకే వి.వి. వినాయక్ లాంటి అనుభవమున్న డైరెక్టర్ తో హీరోగా సినీ ప్రయాణాన్ని గ్రాండ్ గా మొదలుపెట్టినా, రెండో సినిమాతో విక్రమ్ కే. కుమార్ లాంటి వినూత్న దర్శకుడితో “హలో”వంటి ప్రయోగాత్మక సినిమాలో నటించినా, మూడో సినిమాగా “మిస్టర్ మజ్ను” లాంటి రొమాంటిక్ మూవీ చేసినా అఖిల్ కి పరాజయాలే పలకరించాయి. ఆ తర్వాత నాలుగో సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” రూపంలో కొద్దిగా ఓదార్పు విజయం దక్కినా.. పూర్తిస్థాయిలో విజయం అయితే అఖిల్ కి ఇంకా రాలేదనే చెప్పాలి.
ఇప్పుడు అఖిల్ మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పుడే అఖిల్ మాసివ్ లుక్ ని సినిమా యూనిట్ విడుదల చేసి ఫ్యాన్స్ దిల్ ని ఖుష్ చేసింది. అయితే.. ఒక విషయంలో మాత్రం అఖిల్ ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడక తప్పడం లేదు. దానికి కారణం ఇప్పటివరకు ఏజెంట్ మూవీ టీమ్ ఒక్క పాటను కూడా విడుదల చేయకపోవడమే! ఒక సినిమాలో పాటలు చాలా ముఖ్యం. అలాంటిది విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. మూవీ సాంగ్స్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వక పోవడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా ఈ విషయంలో నిరాశకు లోనవుతున్నారు.
ఇక ఈ సినిమాకి “ధృవ” ఫేమ్ హిప్ హప్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఏప్రిల్ 28న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. అఖిల్ తన తదుపరి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న “ఏజెంట్” తర్వాత.. ఓ కూల్ అండ్ లవ్లీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మరి.. ఏజెంట్ అప్డేట్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం ఈ మూవీ యూనిట్ వీలైనంత త్వరగా ఏదైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి. మరి.. “ఏజెంట్” ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.