ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. నవంబర్ 24న న్యూమోనియాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల నవంబర్ 30న తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన చికిత్స పొందిన ఆస్పత్రి బిల్లును ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కట్టినట్లు సమాచారం.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన గొప్ప కవి మృతికి సంతాపంగా ఆయన ఆస్పత్రి ఖర్చును భరించడం కనీస బాధ్యతగా ఏసీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తుంది. అందుకే వెంటనే స్పందించి కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యంతో సంప్రదించి సిరివెన్నెల సీతారామశాస్త్రి చికిత్సకు అయిన ఖర్చును చెల్లించినట్లు సమాచారం.