స్వీటీ అనుష్కకి బయటే కాదు, ఇండస్ట్రీలో కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆమె స్వీట్ స్వభావాన్ని మెచ్చేవారు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలే కాకుండా.. తనే లీడ్ రోల్ లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మాస్ ఇమేజ్ ని సెట్ చేసుకున్న ఏకైక హీరోయిన్ గా అనుష్క నిలిచింది. అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటి సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. వేదం సినిమాలో డీగ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. బాహుబలి సినిమాలో దేవసేన పాత్రలో అనుష్క పోషించిన పాత్రని అంత త్వరగా మరచిపోలేము. గ్లామర్ రోల్స్ అయినా, డీగ్లామర్ రోల్స్ అయినా అనుష్క చేస్తే మైండ్ బ్లాక్ అంతే.
ఆమె ఎన్ని సినిమాలు చేసినా అరుంధతి సినిమా మాత్రం ఆమెకు ఎప్పటికీ ప్రత్యేకమేనట. అరుంధతి సినిమాలో అరుంధతిగా, జేజమ్మ పాత్రలో అనుష్క నటించిన తీరు మాత్రం నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుంది. అంతలా ఆ పాత్రకి అనుష్క న్యాయం చేసింది. అలాంటి హుందా పాత్ర చేసిన అనుష్క.. ఆ తర్వాత బిల్లా సినిమాలో గ్లామరస్ రోల్ చేయవలసి వచ్చింది. అరుంధతి/జేజమ్మ లాంటి పాత్రలు చేసిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి పాత్రలు చేయాలి? అన్న సందేహంలో ఉన్న సమయంలో బిల్లా సినిమా ఆఫర్ వచ్చిందట. సినిమా స్క్రిప్ట్ నచ్చింది, అంతా బానే ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం స్వీటీ చాలా ఇబ్బంది పడిందట. ఎంత గ్లామర్ ఫీల్డ్ అయినా కూడా కొంతమంది హీరోయిన్లు గ్లామర్ విషయంలో కొన్ని నియమాలు, పరిధులు పెట్టుకుంటారు.
నేను ఇలానే ఉంటాను, ఇలాంటి పాత్రలే చేస్తాను అని కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు. అయితే ఒక స్టేజ్ వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పాత్రలు చేయవలసి ఉంటుంది. ఇష్టం లేకపోయినా దర్శకులు చెప్పింది చేయవలసి వస్తుంది. కథ బాగుండి, పాత్ర నచ్చినప్పుడు పాత్రకి తగ్గట్టు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అనుష్క విషయంలో కూడా ఇదే జరిగిందట. తాను బిల్లా సినిమాలో బికినీ వేసుకోవడం వల్ల ఇబ్బందులు పడిందట. అరుంధతి వంటి హుందా పాత్ర చేసిన తర్వాత బిల్లా సినిమాలో గ్లామరస్ రోల్ చేయడం సాహసమని, అయితే మొదటిసారిగా ఈ సినిమా కోసం బికినీ వేసుకున్నానని, తన జీవితంలో ఇబ్బందులు పడ్డ క్షణాలు అవే అంటూ అనుష్క ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అనుష్క ఇబ్బంది పడిందంటే కారణం లేకపోలేదు. సినిమాల్లో ఎంత ఇబ్బంది పడినా బయట మాత్రం చాలా హుందాగా ఉంటుంది. అయితే చీరలు లేదా శరీరం కనబడకుండా డ్రెస్సులు ధరిస్తుంటుంది. అందుకే ఆమెని దేవతలా ఆరాధిస్తుంటారు. ప్రస్తుతం ఈమె జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం సన్నగా ఒకప్పటి లుక్ లోకి అనుష్క మారిపోయింది. సినిమా తొలినాళ్లలో ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. 40 ప్లస్ లో ఇలా ఉండడం అంటే మామూలు విషయం కాదు. పాత్ర కోసం అవసరమైతే బరువు పెరగగలదు, తగ్గగలదు. అందుకే అనుష్కని స్వీటీ అనేది.