సాధారణంగా సినిమాలోని క్యారెక్టర్స్ కోసం హీరోహీరోయిన్స్ తమ గెటప్స్ తో పాటు పర్సనాలిటీలను కూడా మార్చుకోవడం చూస్తుంటాం. క్యారెక్టర్ డిమాండ్ మేరకు నటులు.. పర్సనాలిటీని పెంచడమో, తగ్గించడమో చేస్తుంటారు. అలా కొన్నేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీని స్టార్ హీరోయిన్ గా శాసించిన బ్యూటీ స్వీటీ.. అలియాస్ అనుష్క శెట్టి. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన అనుష్క.. మొదటిసారి ‘సైజ్ జీరో’ మూవీ కోసం ఊహించని విధంగా బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలు చేసిన వెంటనే సైజ్ జీరో కోసం బరువు పెరిగి.. క్యారెక్టర్ పట్ల తన డెడికేషన్ ని ప్రూవ్ చేసుకుంది.
ఆ సినిమా కోసం అంతలా కష్టపడింది.. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత మళ్లీ బాహుబలి 2లో దేవసేనగా, భాగమతి టైటిల్ రోల్ లో యథావిధిగా నాజూకుగా కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అంతేగాక మధ్యమధ్యలో గెస్ట్ అప్పీయరెన్సుగా కూడా మెరిసిన అనుష్క.. 2020లో నిశ్శబ్దం మూవీలో చివరిసారి కనిపించింది. అయితే.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వగా.. ఆ సినిమాలో అనుష్క లుక్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. అప్పటినుండి అనుష్క అంతే లావుగా, బొద్దుగా కనిపిస్తోంది. మరోవైపు కొత్త సినిమాలు చేస్తుందా అంటే.. ఆ సినిమాల ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ని రోజులు బయటికి రాలేదు.
ఈ క్రమంలో తాజాగా అనుష్క పుట్టినరోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్ వారు అనుష్క కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా పేరు రివీల్ చేయలేదు.. కానీ, ఆ సినిమాలో అనుష్క పేరు ‘అన్విత రవళి శెట్టి’ అని ప్రకటించారు. ఇందులో అనుష్క నాజూకుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి.. అనుష్క మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చేసిందా అని అనుకుంటున్నారు. అయితే.. తాజాగా అనుష్క 41వ ఏట అడుగుపెట్టింది. సినిమాలు చేస్తుంది ఓకే.. కానీ, వయసు నలభై ఏళ్ళు దాటిపోయింది కాబట్టి.. పెళ్లి వార్త ఎప్పుడు చెబుతుందోనని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
Happy Birthday 🎂 Sweety ❤️
Introducing ‘Anvitha Ravali Shetty’ aka our beautiful actress @MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations #ProductionNo14 #Anushka48 #NaveenPolishetty3 pic.twitter.com/OmLLhGoawD
— UV Creations (@UV_Creations) November 7, 2022