అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ కుట్టిక తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. టాలీవుడ్ లో కాస్త గాడి తప్పింది అనుకునే క్షణంలో రౌడీబాయ్స్ సినిమాతో మళ్లీ సందడి చేసింది. ఆ సినిమాతో నేను గ్లామర్ రోల్స్ కూడా చేయగలను అని మెసేజ్ ఇచ్చింది. తాజాగా అనుపమ ఓ ఘనత సాధించింది. ఆమె ఫ్రీడమ్ @ మిడ్నైట్ అనే మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ షార్ట్ ఫిల్మ్ కి గానూ.. అనుపనకు ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్-2022లో ఉత్తమ నటి అవార్డు దక్కింది. నిజానికి ఆ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ నటించిన తీరు అందరినీ మంత్రిముగ్దులను చేస్తుంది.
ఇదీ చదవండి: తెలుగునాట KGF-2 ప్రభంజనం.. బాహుబలి 2 రికార్డులు బద్దలు!
సినిమాల విషయానికి వస్తే అనుపమ ఫుల్ బిజీ అయిపోయింది. నిఖిల్ తోనే రెండు సినిమాలు రాబోతున్నాయి. సిద్ధార్థతో కలిసి నటించిన కార్తికేయ 2 సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తికేయ వన్ బిగ్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో సీక్వెన్స్ గా కార్తికేయ 2ను తెరకెక్కించారు. ఇంక సుకుమార్ రచయిత, పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ లో 18 పేజెస్ అనే సినిమాకి కూడా నిఖిల్, అనుపన జత కట్టారు. ఆ సినిమా నుంచి వచ్చిన వీడియో గ్లింప్స్ కు మంచి ఆదరణ లభించింది.
ఇంక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు చేరువగానే ఉంటుంది. వారితో ఇంటరాక్ట్ అవుతుంటుంది. చక్కని చీరకట్టులో మంచి మంచి పిక్స్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అనుపమ చీరకట్టు ఫొటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చాలానే ఉంటాయి. తాజాగా సాంప్రదాయంగా క్రీమ్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజ్‌తో చూపు తిప్పుకోనీకుండా కట్టి పడేసింది. ఉత్తమ నటి అవార్డు అందుకున్న అనుపమకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.