బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్ తరువాత అనుపమకు తెలుగులో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే తెలుగు పరిశ్రమలో అభిమానులను సంపాదించింది. అయితే.. తాజాగా అనుపమ గర్భవతిగా ఉన్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన వారు షాక్ అవుతున్నారు. పెళ్లి కాకుండానే గర్భం రావడం ఏంటని చెవులు కొరుక్కుంటున్నారు.
అనుపమ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది. గతంలో ఇంట్లో సరదగా గర్భవతి గెటప్ వేసింది ఈ బ్యూటీ. అప్పటి పిక్స్ ను షేర్ చేసి.. ఫన్నీ కామెంట్స్ చేసింది. అంతకుమించి ఆ గర్భవతిగా ఉన్న తన పిక్స్ వెనుక రహస్యం ఏమీ లేదు. కానీ.. పెళ్లికాని ఈ భామ గర్భవతి గెటప్ లో కనిపించడం అభిమానులతో పాటు మిగిలిన వారినీ కంగారు పెట్టింది.
ఇక అనుపమ లేటెస్ట్ రిలీజ్.. రౌడీ బాయ్స్ లో అందాలు ఆరబోసింది. మొన్నటి వరకు హోమ్లీ రోల్స్ చేసిన ఈ భామ.. కాస్త హద్దలు దాటి నటించింది. ఎప్పుడూ టచ్ చేయని లిప్ లాక్ సన్నివేశాల్లోనూ నటించింది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపిన అనుపమ.. చేతిలో సినిమాలు లేకనే గ్లామరస్ రోల్స్ కి ఓకే చేపిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కార్తికేయ-2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల విజయంపైనే అనుపమ కెరీర్ ఆధారపడి ఉందనేది వాస్తవం. అనుపమ పరమేశ్వరన్ గర్భవతిగా కనిపించిన పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.