సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి రూమర్స్ రావడమనేది చాలా కామన్. ఎప్పుడు ఎక్కడ కొత్త వ్యక్తులతో కనిపించినా, లేదా షూటింగ్స్ టైంలో హీరోలతో క్లోజ్ గా ఉన్నా ఏదొక రూమర్ పుట్టుకొచ్చేస్తుంది. అయితే.. తమపై వచ్చిన రూమర్లను సెలబ్రిటీలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పాయింట్. కొద్దిరోజులుగా అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గురించి పెద్ద రూమర్ వైరల్ అవుతోంది. తాను అల్లు శిరీష్ తో డేటింగ్ లో ఉందని.. అందుకే ఇద్దరి మధ్య సినిమాలో కెమిస్ట్రీ ఆ స్థాయిలో పండిందని కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ విని బాధ కలిగిందని చెబుతూ తాజాగా అను ఇమ్మానుయేల్ స్పందించింది.
రీసెంట్ గా అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మానుయేల్ ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమా చేసింది. రొమాంటిక్ లవ్ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శిరీష్, అనుల మధ్య చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఆ సన్నివేశాలలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందని అభిప్రాయాలు బయటికి వచ్చాయి. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా శిరీష్, అనుల కెమిస్ట్రీని ప్రశంసించారు. మరోవైపు అనుకి, శిరీష్ కి మధ్య ఎఫైర్స్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇలాంటి వార్తలు తమ ఫ్యామిలీ చెవినపడి వారు బాధపడ్డారని చెప్పుకొచ్చింది అను.
ఆమె మాట్లాడుతూ.. “నా గురించి వచ్చే రూమర్స్ ని నేను పెద్దగా పట్టించుకోను. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేవరకు శిరీష్ తో నాకు పరిచయం లేదు. ఈ మధ్య ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి హోటల్ కి వెళ్లినా.. వెంటనే రకరకాల పుకార్లు పుట్టించేస్తున్నారు. అబ్బాయి, అమ్మాయి ఫ్రెండ్స్ లా కూడా బయటికి వెళ్లకూడదా? అని అను ఆవేదన బయటపెట్టింది. ఇకనైనా తన గురించి ఇలాంటి రూమర్స్ ఆపేయాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా స్టార్ హీరో కార్తీ సరసన ‘జపాన్’ అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. త్వరలో షూటింగ్ మొదలు కానుండగా.. తమిళంలో అనుకి ఇది రెండో సినిమా. చూడాలి మరి కార్తీ సరసన ఎలాంటి హిట్ అందుకుంటుందో!