ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సన్ “జారు మిఠాయి” పాట పాడిన భారతి. జిన్నా సినిమా ఈవెంట్ లో భారతి ఈ పాట పాడి నెలలు గడచిపోయిన ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. భారతి పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను హల్ చల్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి చూసిన చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఈ పాట పాడుతూ తెగ సందడి చేస్తున్నారు. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్.. ఇలా ఎక్కడ చూసినా సరే ‘జంపలకడి జారు మిఠాయి’ పాటనే వినిపిస్తోంది. దీంతో భారతి, నాగరాజమ్మలు ఫుల్ ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆ జారు మిఠాయి పాడిన భారతమ్మ మరో కొత్త జానపద పాటను పాడింది. ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె… “నేను చిన్నదాన్నిరో ఓ చందమామ” అనే మరో జానపద పాటను పాడింది. ప్రస్తుతం ఈ పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు జానపద గేయాలకు, పాటలకు మంచి ఆదరణ ఉంది. అయితే ప్రస్తుతం అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడో ఓ చోట మాత్రమే అవి వినిపిస్తున్నాయి. ఇటీవల మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమాలో ‘జారుమిఠాయి’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. అయితే ఆ పాటకు ఇన్సిపిరేషన్ చిత్తూరులోని జానపదం గేయం అని తెలుస్తోంది. ఆ పాట ద్వారా టాలెంట్ ఉన్న ఇద్దరు మహిళలు భారతమ్మ, నాగరాజమ్మ వెలుగులోకి వచ్చారు. ఆ పాటతో వారు ఒక్కసారిగా జారుమిఠాయి పాటతో ఫేమ్ అయ్యారు. అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరు.. జానపద పాటలకు సంబంధించి అనేక విషయాలు చెప్పారు. అలానే ఈ క్రమంలోనే ఆ పాట ఎలా పుట్టింది? అర్థం ఏంటని తదితర విషయాలు బయటపెట్టారు.
అలానే వరినాట్లు వేయడానికి, కూలీ పనులకు వెళ్లిన సందర్భంలో సరదాగా ఇలాంటి పాటలు పాడుకుంటామని వారు తెలిపారు. ఇక ‘జంపలకిడి జారు మిఠాయి’ అంటే అమ్మాయి పేరు అని భారతమ్మ చెప్పారు. ఇదే పాటలోని ‘మొగ్గలఖాలింక’ అంటే అబ్బాయిలు మనల్ని చూడట్లేదు అని అర్థం వస్తుందని భారతమ్మ తెలిపారు. అమ్మ వాళ్ల ఊరిలో ఈ గీతాల్ని నేర్చుకున్నానని తెలిపింది. అయితే జారుమిఠాయి కాకుండా మరోక పాటను పాడమని యాంకర్ అడిగిన సందర్భంలో భారతమ్మ మరో జానపద పాట పాడారు. “నేను చిన్నాదాన్నిరో ఓ చందమామ” అంటూ మరో జానపద పాటను అద్భుతంగా పాడింది. ఈ జానపత పాట కూడా జారుమిఠాయి సాంగ్ ను మించి ఉంది. ఆ పాటలోని పదాల అల్లిక చాలా అద్భుతంగా ఉంది. దీంతో ప్రస్తుతం ఈ పాటసైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.