టాలీవుడ్ లో యాంకర్ సుమకి ప్రత్యేక స్థానం. గలగలా మాట్లాడుతూ.. సమయస్ఫూర్తిగా పంచులు విసురుతూ షోలని ఆసక్తికరంగా మార్చడంలో సుమ చాలా నేర్పరి. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న సుమ.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా పోస్ట్‌లు చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. కుమారుడు రోషన్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇవి చూసిన నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: యాంకర్ సుమకు అరుదైన వ్యాధి.. షాక్‌లో అభిమానులు..
రోషన్ బర్త్‌డే(మార్చి 15)సందర్భంగా మంగళవారం తన ఇన్‌స్టా ఖాతాలో సుమ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తమ కుమారుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ షేర్ చేసిన ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. అతను రోషనేనా? ఇలా మారిపోయాడేంటి? అప్పుడే అంత పెద్దొడు అయిపోయాడా.. వామ్మో ఈ హైట్ ఏంటి సామి.. ప్రభాస్ ని మించి పోయేలా ఉన్నావ్‌గా అంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే రోషన్, సుమ తల్లీకొడుకుల్లా కాకుండా అక్క, తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలో రోషన్ చాలా పొడవుగా, క్యాజువల్ లుక్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఇది కూడా చదవండి: సుమపై సిద్దార్ధ్ సంచలన కామెంట్స్.. కత్తిలా ఉంటావ్ అంటూ..!
ఇక రోషన్ కొన్నేళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రోషన్.. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తమ తనయుడి కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు సుమ, రాజీవ్ బాగానే ప్రయత్నిస్తున్నారు. సొంతంగా ఓ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. గతేడాదిలోనే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కోటి రూపాయల కారు! స్టార్ హోటల్ లాంటి ఇల్లు! ఎవరీ మిత్రా శర్మ?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.