యాంకర్‌ సుమకు అరుదైన వ్యాధి.. షాక్‌లో అభిమానులు..

Suma Infection

బుల్లితెర క్వీన్‌.. స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఏ టీవీ షో చూసినా.. ఏ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చూసినా ఆవిడే కనిపిస్తుంది. యాంకరింగ్‌కి కూడా అంత క్రేజ్‌ ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా చేసింది. టీవీ సీరియల్‌తో కెరీర్‌ ప్రపారంభించిన సుమ ఆ తర్వాత యాంకరింగ్‌ వైపు మళ్లింది. కేరళ నుంచి వచ్చినా..  అచ్చమైన తెలుగమ్మాయిలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. అసలు అంత బాగా ఎలా మాట్లాడగలదు ఎక్కడ నేర్చుకుంది అనే డౌట్‌ రావొచ్చు. సుమ తల్లి ముందు తెలుగు నేర్చుకుని.. ఆ తర్వాత సుమాకు తెలుగు నేర్పారంట. ఆవిడ చేసిన కృషివల్లే తెలుగు బుల్లితెరకు ఒక అద్భుతమైన యాంకర్‌ దొరికింది. తాజాగా సుమ ఒక యూట్యూబ్‌ వీడియో తన జీవితంలోని ఒక భయంకరమైన నిజాన్ని తన అభిమానులతో పంచుకుంది. ఆమెకు ఒక అరుదైన వ్యాధి ఉంది. అదే విషయాన్ని ఇప్పటివరకు దాచిపెట్టిన సుమ ఇప్పుడు అందరికీ చెప్పేసింది.

ఇదీ చదవండి: మంచు విష్ణు విజయం వెనుకున్న  10 కారణాలు

Suma Injuryఅసలు విషయం ఏంటంటే.. సుమ చాలా రోజులుగా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దాన్ని క్యూర్‌ చేయించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అది ఇంక తగ్గదు అని ఫిక్స్‌ అయ్యాక.. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ‘నాకు ఒక అరుదైన చర్మవ్యాధి ఉంది. దానిని కెలాయిడ్‌ టెండెన్సీ అంటారు. అంటే నాకు ఏదైనా గాయం అయితే.. అది అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా హీల్‌ అవుతుంది. దాని వల్ల నా ఒంటిపై గాయం మానినా.. దాని ఆనవాళ్లు బాగా కనిపిస్తుంటాయి. ఇంతకాలం దానిని దాచిపెట్టాను. ఇంక దాచిపెట్టాలి అనుకోవట్లేదు’ అని సుమ తెలిపింది. ఎవరైనా తమలో ఉండే లోపాలను అందరి నుంచి దాచిపెట్టకుండా ఓపెన్‌ చెప్పేస్తే ఒక భయం.. ఆత్మన్యూనతా భావం పోతాయని చెప్పుకొచ్చింది. చర్మవ్యాధే కాబట్టి దానికి క్యూర్‌ లేకపోయినా.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అభిమానులు భావిస్తున్నారు. మరీ అంత భయంకరమైన వ్యాధి అయి ఉండదని ఊపిరిపీల్చుకున్నారు.