తెలుగు బుల్లితెరపై పవర్ ఫుల్ యాంకర్‌గా దూసుకెళ్తోంది అందాల యాంకర్ శ్రీముఖి. అటు వెండితెరపై సినిమాలు చేస్తూ..ఇటు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ తన గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో ఈ యాంకర్ స్వీటి అనే పాత్రలో నటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహించారు డైరెక్టర్ సత్తిబాబు.
కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం ఈ నెల 19 న విడుదల కాబోతోంది. అయితే ప్రమోషన్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటోంది శ్రీముఖి. ఇక విషయం ఏంటంటే? ఇటీవల కాలంలో శ్రీముఖి స్టార్ మా నిర్వహించిన సిక్త్ సెన్స్ ప్రోగ్రామ్‌లో శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి ముద్దు పెట్టిన విషయం తెలిసిందే.
ఇక అప్పట్లో ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. అయితే తాజాగా దీనిపై యాంకర్ శ్రీముఖి సమాధానం ఇస్తూ.. ఆ ప్రోగ్రామ్‌లో శేఖర్ మాస్టర్ నేను ఆర్టిస్ట్‌లలా వ్యవహరించామని, అందుకే ముద్దులు పెట్టానని తెలిపారు. అయినా ఇందులో తప్పేముందో నాకు అర్ధం కావటం లేదని అంటోంది శ్రీముఖి. ఇక దీనిపై అప్పట్లో తీవ్ర చర్చ కూడా జరిగింది.