యాంకర్ రష్మీ.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక యాంకరింగ్ లోకి రాక ముందు నుంచే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు సైతం చేసింది. అయితే జబర్దస్త్ తోనే రష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. దాంతోనే వరుసగా సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. గంటూర్ టాకీస్ మూవీతో తొలిసారిగా వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రష్మీ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మదిని దొచింది. తాజాగా మరోసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది.
యాంకర్ రష్మీ, నందు జంటగా కలిసి నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. డైరెక్టర్ రాజ్ విరాట్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా విడుదల అయ్యింది. ఐమ్యాక్స్ లో ఈ చిత్రాన్ని వీక్షించిన చిత్ర బృందం అనంతరం మీడియాతో మాట్లాడారు. సినిమా బాగుందని, మూవీలో అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయని హీరో నందు అన్నాడు. సినిమాలో కొన్ని కొన్ని సీన్లు చూసే సెన్సార్ బోర్డు వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చారని రష్మీ అన్నది. కానీ ఈ సినిమాను కుటుంబంతో సహ వచ్చి చూడొచ్చాని, చూడాలని అభిమానులను కోరింది రష్మీ. ఐమ్యాక్స్ ముందు వారు మాట్లాడుతుంటే అభిమానులు పెద్ద ఎత్తున రష్మీని కలవడానికి ఎగబడ్డారు. ఫ్యాన్స్ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో నందు రష్మీకి సపోర్టుగా నిలబడ్డాడు. ఫ్యాన్స్ పూలదండలను నందు, రష్మీల మీదకు విసిరారు. దాంతో ఈ వీడియో చూసిన అభిమానులు రష్మీ మాస్ క్రేజ్ చూసి ఆశ్చర్య పోతున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో సైతం ఓ పాటలో తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది రష్మీ.