యాంకర్ అనసూయ వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది. అటు సినిమాలు, ఇటు బుల్లితెర ను మానేజ్ చేస్తూ దూసుకుపోతోంది. వయసు మీదపడుతున్న చెక్కుచెదరని అందంలో అస్సలు తేడా రాకుండా చూస్తోంది. యంగ్ లేడీ యాంకర్లకు గట్టి పోటీనిస్తూ తన పంథాను కొనసాగిస్తోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తూ వరుస అవకాశాలను చేజక్కించుకుంటోంది యాంకర్ అనసూయ.
ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ అనసూయ ఓ కిలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంటోంది. ఇక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనసూయ ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
సుకుమార్ గురించి అనసూయ మాట్లాడుతూ…ఆర్టిస్ట్ లను డైరెక్టర్ సుకుమార్ ఒక లెక్కలో చెక్కుతారని వెల్లడించారు. ఈ డైరెక్టర్ తను చేసే సినిమాల్లో ఎవరికీ రెండో అవకాశం ఇవ్వరని, కానీ తనకు మాత్రం రెండో సారి ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం ఒక లక్ గా భావిస్తానని అనసూయ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఈ భామ సునీల్ కు భార్యగా కనిపించనుందని తెలుస్తోంది. ఇక భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక మందన. పాన్ ఇండియా లెవల్ లో తీస్తున్న ఈసినిమాపై దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇక విడుదలైన చిత్ర టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.