సాధారణంగా సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కొత్తగా ఏదైనా పోస్ట్ పెట్టారంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఆ పోస్ట్ పైనే పెడుతుంటారు. తాజాగా తెలుగు యాంకర్ కం యాక్టర్ అనసూయ భరద్వాజ్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇంతకీ అనసూయ ఏం పోస్ట్ పెట్టిందంటే.. ఆమె భర్త ఇచ్చిన కొత్త గిఫ్ట్ చూపుతూ ఫోటోలకు ఫోజిచ్చింది.
ఆ ఫోటోలను ఇంస్టాలో పోస్ట్ చేసి.. ‘నా భర్త ఇచ్చిన కొత్త గిఫ్ట్ చూడండి’ అంటూ క్యాప్షన్ జోడించింది. మరి ఆ కొత్త గిఫ్ట్ ఏంటంటే.. అర్మానీ హ్యాండ్ వాచ్. అనసూయ అర్మానీ కంపెనీకి చెందిన వాచ్ అని కూడా కంపెనీ ఇంస్టా ప్రొఫైల్ ట్యాగ్ చేసింది. కానీ అర్మానీ వాచ్ అంటే.. అత్యంత కాస్లీ అనే సంగతి అందరికి తెలిసిందే. మరి భర్త నుండి అంత కాస్లీ గిఫ్ట్ అందుకుందంటే లక్కీనే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనసూయ వాచ్ చూపిస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. అనసూయ ప్రస్తుతం అటు టీవీ ప్రోగ్రాంలతో పాటు పలు సినిమాల్లో నటిస్తుంది. మరి అనసూయ కొత్త గిఫ్ట్ పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.