అందాల ముద్దుగుమ్మ అనసూయ నటిగా, బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా, టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పొగొటేస్తుంది. తాజాగా మరోసారి తన బోల్డ్ ఫోటోలతో రచ్చ రచ్చ చేసింది.
ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. అలానే సెలబ్రిటీల విషయంలో కూడా అంతే.. ఒకప్పుడు వారి విషయాలు తెలియాలంటే చాలా ఆలస్యం అయ్యేది. అయితే సోషల్ మీడియా వాడకం పెరిగాక, సెలబ్రిటీలు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా హీరోయిన్స్, బుల్లితెర నటీమణులు, యాంకర్లు మాత్రం తమ అందచందాలతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంటారు. ఈ కోవలో ముందు వరుసలో ఉంటుంది బుల్లితెర ‘అందాల రాశి’ అనసూయ భరద్వాజ్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ.. రచ్చ లేపుతుంది. ఈ సారి కూడా బోల్డ్ షూట్ ఫోటోలతో మెరిసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా చురక్తుతల్లాంటి చూపులతో చిన్నదుస్తులో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతోన్నాయి.
అనసూయ భరద్వాజ్..టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అలానే బుల్లితెరపై సందడి చేసే స్టార్ యాంకర్లో అనసూయ ఒకరు. బుల్లితెరపై అనేక షోల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ పాపులర్ అయ్యింది. తన అందం, అభినయంతో ఈ అమ్మడు బుల్లితెరతో పాటు వెండి తెరపై రాణిస్తుంది. ముఖ్యంగా తన గ్లామర్ తో బుల్లితెరపై అందాల రాశిలాగా వెలుగొందుతోంది. అనూ.. బుల్లితెర ద్వారా పరిచయమైనప్పటికీ వెండితెర మీద అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ.. సందడి చేస్తోంది. తెలుగులో ఫుల్ క్రేజ్ ఉన్న జబర్ధస్త్ కామెడీ షోను అనసూయ కోసం చూసే వారంటే అతియోక్తి కాదు. ఆ షో మానేసినప్పటికీ.. అభిమానులను మాత్రం తన ఫొటోలతో పలకరిస్తూనే ఉంది.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సమాజంలో జరిగే సంఘటనలపై కూడా తనదైన స్టైల్లో స్పందిస్తుంటుంది. అలానే తన బోల్డ్ ఫోటో షూట్ లో కుర్రాలకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా టీ షర్ట్ లో బోల్డ్ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఫోటోల దెబ్బకు సోషల్ మీడియా హీటెక్కింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, ఆమె అభిమానులు చిత్ర, విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనసూయ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.