టాలీవుడ్ గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న అనసూయ.. జబర్దస్త్ లో దాదాపు తొమ్మిదేళ్లు యాంకర్ గా కొనసాగింది. ఇక జబర్దస్త్ లో యాంకర్ గా కంటిన్యూ అవుతూనే.. సినీ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అనసూయ. తెలుగులో యాంకర్ సుమ తర్వాత సెకండ్ ప్లేస్ లో అనసూయనే ఉంటుందని తెలిసిందే. అదీగాక గ్లామరస్ యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. ప్రెజెంట్ గ్లామరస్ యాంకర్స్ గా ట్రెండ్ అవుతున్న రష్మీ గౌతమ్, శ్రీముఖి ఇలా ఎవరైనా తన తర్వాతే అని ప్రూవ్ చేసింది.
ఇక జబర్దస్త్ యాంకర్ గా, సినీ నటిగానే కాకుండా సోషల్ మీడియాలో మిలియన్స్ కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అనసూయ. సోషల్ మీడియా అనసూయ ఏం పోస్ట్ చేసినా.. ఏ పిక్ పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతుంటాయి. అయితే.. ఇటీవల జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసిన అనసూయ.. తనకు బయటికి రావాలని అనిపించి వచ్చేసానని, బాడీ షేమింగ్ కామెంట్స్ తాను భరించలేనని కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆ తర్వాత నుండి పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెడుతూ వస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించి.. ఫ్యాన్స్ ప్రశ్నలకు ఓపికగా ఆన్సర్స్ చెబుతూ ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది.
ఈ క్రమంలో మళ్లీ టీవీ షోలో ఎప్పుడు కనిపిస్తారని అడిగిన ప్రశ్నకు.. ‘టీవీ షోలకి కావాలనే బ్రేక్ తీసుకున్నా, ఏదైనా మంచి ఎక్సయిటింగ్ షో వచ్చినప్పుడు వస్తా’ అని చెప్పింది. అలాగే ‘ఇప్పుడు జబర్దస్త్ ని మిస్ అవుతున్నారా?’ అనే ప్రశ్నకు స్పందిస్తూ.. “అఫ్ కోర్స్(అవును మిస్ అవుతున్నా).. నా జీవితంలో, నా హార్ట్ లో జబర్దస్త్ కి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారో.. అక్కడ ఉండకపోవచ్చు. లైఫ్ లో రిస్క్ తో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకతప్పదు” అని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది. అనసూయ రెస్పాండ్ అయిన పిక్ కూడా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం జబర్దస్త్ గురించి అనసూయ రియాక్ట్ అయిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రీసెంట్ గా అనసూయ తన భర్తతో కలిసి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ పూజ ఎందుకు చేశారు? అనే ప్రశ్నకు కూడా అనసూయ సమాధానం చెప్పడం విశేషం. అనసూయ ఫాదర్ కి సంబంధించి సంవత్సరీకం తర్వాత సుదర్శన హోమం, సత్యనారాయణ వ్రతం చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. చాలా సినిమాలతో బిజీ అయినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ పుష్ప-2తో పాటు కృష్ణవంశీ డైరెక్షన్ లో ‘రంగమార్తాండ’ మూవీ చేస్తోంది. చూడాలి మరి త్వరలో ఏదైనా టీవీ షోతో సర్ప్రైజ్ చేస్తుందేమో!
— Hardin (@hardintessa143) December 5, 2022