స్టార్ నటీనటులు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. సినిమాలు, యాడ్స్ చేసేటప్పుడు కాస్తంత కేర్ ఫుల్ గానూ ఉండాలి. ఎందుకంటే సదరు యాక్టర్స్ అనుమతి లేకపోయినా సరే కొన్నిసార్లు వాళ్ల ఫొటోలు, వీడియోల్ని కొందరు ఉపయోగించేస్తుటారు. స్టార్స్ చేశారు కదా అని సినీ అభిమానులు కూడా కొన్నిసార్లు మోసపోతుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. దీంతో స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సీరియస్ అయ్యారు. ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో చాలా ఫేమ్ సంపాదించారు. ఇప్పుడు పలు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన.. తన హక్కులని కాపాడాలని అమితాబ్ బచ్చన్ కోర్టును ఆశ్రయించడం షాకింగ్ అనిపించింది. వాణిజ్య ప్రకటనల్లో తన పేరు, వాయిస్, ఫొటోలు అనుమతి లేకుండా యూజ్ చేస్తున్నారని బిగ్ బీ కోర్టుకు వెళ్లారు. తన పర్మిషన్ లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో నకీలీ లాటరీ స్కామ్ నడుస్తున్నట్లు తెలిసిందని, తన ప్రచార హక్కులని కాపాడని పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అమితాబ్ అనుమతి లేకుండా ఓ వ్యక్తిగానీ, కంపెనీ గానీ.. ఆయన ఫొటోస్, వాయిస్ వాడకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటివి అడ్డుకోకపోతే.. అమితాబ్ కు చెడ్డపేరు వచ్చే ఛాన్సుందని కోర్టు పేర్కొంది. ఆయన పర్మిషన్ లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని న్యాయస్థానం పేర్కొంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్.. కేబీసీ హోస్ట్ గా చాలా పేరు సంపాదించారు. గత 15 సీజన్ల నుంచి ఆయనే హోస్ట్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం తెలుగులోనూ ప్రభాస్ ‘ప్రాజెక్టు K’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరి అమితాబ్ కోట్లు మెట్లు ఎక్కడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Amitabh Bachchan’s voice, image, characteristics, can’t be used without his consent: Delhi High Court
Read @ANI Story | https://t.co/lcYNmOGjBW#AmitabhBachchan #DelhiHighCourt pic.twitter.com/GgIiXMhark
— ANI Digital (@ani_digital) November 25, 2022