భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టుకి మెంటార్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఎంతో మంది మాజీలు విమర్శలు గుప్పించారు. దీంతో గంభీర్ తనని అవమానించారంటూ కొంతమందిపై పరువు నష్టం వేసాడు.
సెలబ్రిటీల మీద వచ్చినన్ని రూమర్లు.. ఇక ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఫేక్ న్యూస్ మరింత విస్తరిస్తోంది. సెలబ్రిటీల మీదనే కాక.. వారి పిల్లల గురించి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బీ మనవరాలు.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఏమన్నదంటే..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల గురించి వచ్చినన్ని తప్పుడు వార్తలు ఇక ఎవరి గురించి రావు. సెలబ్రిటీలు అయినందుకు వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లల మీద కూడా తప్పుడు వార్తలు వస్తుంటాయి. ఐశ్వర్యరాయ్ కుమార్తె మీద కూడా ఇలాంటి తప్పుడు వార్తలు వచ్చాయి. ఆమె ఏం చేసింది అంటే..
ఒక వ్యక్తి ఆస్తులు ఎక్కువగా ఉంటే పన్నులు కట్టాల్సి వస్తుందని చెప్పి తన ఆస్తులను బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటాడు. అయితే దీని వల్ల నల్లధనం పేరుకుపోయి దేశానికి నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. బినామీ పేరు మీద ఆస్తుల రూపంలో ఉన్న బ్లాక్ మనీని బయటకు తీసుకురావాలంటే ఆస్తులను ఆధార్ తో అనుసంధానం చేయాలన్న రూల్ ని తీసుకురావాలని పిటిషన్ వేశారు.
'మహిళలు స్నానం చేస్తుంటే బాత్రూంలోకి తొంగిచూడటం నేరం..' చూడండి. సమాజంలో కామాంధుల ఆగడాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో.. ఇది తప్పు అని హైకోర్టు చెప్పాల్సి వస్తోంది. మైనర్ బాలిక స్నానం చేస్తుంటే తొంగిచూసిన ఓ బడుద్ధాయి.. అలా చూడటం తప్పుకాదంటూ కోర్టును ఆశ్రయించాడు. ఇతగాడిని, ఇతని తరుపున వాదించిన లాయర్ వాదనలు చదివితే.. ఇలా కూడా వాదించొచ్చా..? అనిపించక మానదు.
ఈ మధ్యకాలంలో కోర్టులు ఇచ్చే తీర్పులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. గతంలో సుప్రీ కోర్టు, హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు పౌరులను షాక్ కి గురి చేశాయి. మరీ ముఖ్యంగా అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన విషయాల్లో కోర్టులు అనేక సంచలన తీర్పులను వెల్లడించాయి. అదే విధంగా భార్యల పట్ల అతిగా ప్రవర్తించే భర్తలకు కూడా హైకోర్టు అక్షింతలు వేస్తూ ఉంటుంది. భార్యపై భౌతిక దాడి, సొమ్ము కోసం వారిని వేధించడం వంటి విషయాల్లో కోర్టులు […]
ఆహా ఓటీటీ వేదికగా.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో.. ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించి.. దేశంలోని టాక్ షోలకి.. అన్‌స్టాపబుల్ బాప్ షోగా నిలిచింది. ఫస్ట్ సీజన్ సాధించిన భారీ సక్సెస్.. రెండో సీజన్‌ని అంతకు మించి అనే రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకుస్తున్నారు. రెండో సీజన్‌లో.. సినీ రంగానికి చెందని వారిని మాత్రమే కాక.. రాజకీయాలకు చెందిన సెలబ్రిటీలు కూడా అన్‌స్టాపబుల్‌లో సందడి చేస్తున్నారు. […]
ఈ మధ్యకాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం అనేక సంచలన తీర్పులు ఇచ్చింది. అలానే వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు సైతం పౌరలు విస్మయానికి గురై తీర్పులు సైతం ఇస్తున్నాయి. ఇటీవలే కేరళ హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగి లంచం అడగటం తప్పుకాదని, లంచం తీసుకుంటే నేరం అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అలానే గతంలో కూడా పలు కోర్టులు వ్యభిచారం, వివాహేతర సంబంధాలు, లైంగిక విషయాలకు సంబంధించిన విషయాలపై ఆసక్తికరమైన తీర్పులు ఇచ్చాయి. మహిళలు పిల్లలను కనే విషయంలో తాజాగా […]
స్టార్ నటీనటులు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. సినిమాలు, యాడ్స్ చేసేటప్పుడు కాస్తంత కేర్ ఫుల్ గానూ ఉండాలి. ఎందుకంటే సదరు యాక్టర్స్ అనుమతి లేకపోయినా సరే కొన్నిసార్లు వాళ్ల ఫొటోలు, వీడియోల్ని కొందరు ఉపయోగించేస్తుటారు. స్టార్స్ చేశారు కదా అని సినీ అభిమానులు కూడా కొన్నిసార్లు మోసపోతుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. దీంతో స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సీరియస్ అయ్యారు. ఏకంగా కోర్టు […]
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. సాహూ, రాధే శ్యామ్ సినిమాలు కంటెంట్ పరంగా కాస్త నిరాశపరిచాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు తర్వాత చేయబోయే సినిమాల మీదనే పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలు రెడీ అవుతున్నాయి. దీని కంటే ముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రాబోతుంది. ఇప్పటి వరకూ దేశం గర్వించతగ్గ సినిమాలు […]