ఈ మధ్య జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తూ, అంచనాలు పెంచేసుకుంటున్న తెలుగు మూవీ ‘అమిగోస్’. టైటిల్ ఏంటి కాస్త వెరైటీగా ఉందని చాలామంది అనుకున్నారు. దాని అసలు మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఇక అమిగోస్ అంటే స్పానిష్ లో ఫ్రెండ్. ఇక పోస్టర్ల దగ్గర నుంచి పాటల వరకు ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. అది కాస్త బాగుండటంతో పాటు సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అనే క్యూరియాసిటీని పెంచుతోంది.
ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే.. సాధారణంగా ఏ సినిమా తీసుకున్నాసరే హీరో, విలన్, కమెడియన్ అని ఎవరికీ వారు సెపరేట్ గా ఉంటారు. ‘అమిగోస్’లో అవన్నీ హీరో కల్యాణ్ రామ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో గడ్డంతో ఓ క్యారెక్టర్ ని ఇండియన్ పాబ్లో ఎస్కబార్ అని చెప్పుకొచ్చారు. అతడెంత దారుణంగా ప్రవర్తిస్తాడు. చంపడానికైనా సరే వెనుకాడడు అనేలా చూపించారు. ఇక మరో కల్యాణ్ రామ్ పాత్రకు హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉంటుంది. ఇక ఫైనల్ గా అమాయకమైన మరో రోల్ కూడా ఉంది.
అలాంటి వేర్వేరు నేపథ్యాలకు చెందిన ఈ ముగ్గురు కూడా అనుకోకుండా కలుస్తారు. ఆ తర్వాత విలన్ తరహా కల్యాణ్ రామ్ వల్ల మిగిలిన ఇద్దరూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ట్రైలర్ లో సస్పెన్స్ గా ఉంచారు. టైటిల్ అమిగోస్ (ఫ్రెండ్) అని పెట్టారు కానీ ట్రైలర్ లో మాత్రం.. ‘మనం ఫ్రెండ్స్ కాదు బ్రదర్స్ కాదు.. జస్ట్ లుక్ ఎలైక్స్’ అని డైలాగ్ ఉంది. దీన్నిబట్టి చూస్తుంటే సమ్ థింగ్ ఏదో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజయ్యే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ ఆషిక రంగనాథ్ చేసింది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు, జిబ్రాన్ సంగీతమందించాడు. మరి ‘అమిగోస్’ ట్రైలర్ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.