కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతుండగా.. అభిమానులు కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ సినిమా అప్డేట్ గురించి ప్రశ్నించారు. ఇక అభిమానుల కన్నా ముందు.. సుమ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. తారక్‌ని మాట్లాడాల్సిందిగా కోరుతూ.. మీ కోసం ఎన్టీఆర్.. అప్‌డేట్ ఇస్తారు అంటూ హింట్ ఇచ్చింది. ఇటు సుమ, అటు అభిమానులు అప్‌డేట్ అంటూ పదే పదే అడుగుతుండటంతో దీనిపై ఎన్టీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్‌కు స్మూత్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మీరు ఇలా ఊరికే అప్డేట్ అడుగుతూ ఉంటే.. దర్శక, నిర్మాతలపై ప్రెజర్ పడుతుంది.. ఏదైనా ఉంటే నా భార్య కన్నా ముందు మీకే చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే వేదిక మీద.. అప్డేట్ అంటూ సుమ గుర్తుకు చేయడంతో ఎన్టీఆర్ కాస్త సీరియస్ అయ్యాడు. సుమ వైపు కోపంగా చూస్తూ.. వాళ్ల కన్నా ముందు ఈమెనే ఇరికించేలా ఉంది అటూ సుమపై కౌంటర్ వేశాడు. అయితే ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో జూనియర్ ప్రవర్తన తీరును కొందరు తప్పు బడుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వచ్చి ఏడాది పైనే అయ్యింది. ఓ వైపు ఇదే చిత్రంలో నటించిన రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తూ.. ఎప్పటికప్పుడు వాటి అప్డేట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కమిట్ అవ్వలేదు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని ప్రకటన వచ్చింది.
కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. రిలీజ్ డేట్ ఏంటి.. ఎవరెవరు నటిస్తున్నారు వంటి విషయాల గురించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ లేదు. దాంతో అభిమానులు అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కొరటాల-తారక్ సినిమా అప్డేట్ గురించి ప్రశ్నించారు. సుమ కూడా ఇదే పని చేసింది. ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే నాలుగైదు గంటల పాటు సాగుతుంది. అంతసేపు అభిమానులను అలరించే బాధ్యత యాంకర్ మీదే ఎక్కువగా ఉంటుంది. దానిలో భాగంగానే సుమ కూడా అదే పని చేసింది. ఇందులో తప్పేముంది అంటున్నారు నెటిజనులు.
పైగా సుమకు జూనియర్ ఎన్టీఆర్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఎన్టీఆర్, సుమ భర్త రాజీవ్ కనకాల ఇద్దరు మంచి స్నేహితులు. గతంలో సుమ ప్రారంభించిన ఓ షోకు తొలి గెస్ట్‌గా తారకే వచ్చాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా కూడా సుమ మీద సెటైర్లు, జోకులు వేశాడు. వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. ఫ్యాన్స్ తరఫున సుమ.. అప్డేట్ గురించి ఎన్టీఆర్‌కు గుర్తు చేసింది. ఇందులో సుమ తప్పు ఏముంది… దానికి ఎన్టీఆర్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అంటున్నారు నెటిజనులు. అభిమానుల మనసులో ఉన్నదే తను అడిగింది.. ఈమాత్రం దానికి ఎన్టీఆర్.. సుమ మీద అంత సీరియస్ అవ్వడం అవసరమా అంటున్నారు నెటిజనులు.
కానీ కొందరు మాత్రం.. అసలే ఎన్టీఆర్‌కు హెల్త్ బాగాలేదు.. కానీ ఓపిక చేసుకుని ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వచ్చాడు. తను వచ్చింది.. వేరే హీరో సినిమా కార్యక్రమానికి. అక్కడ కూడా తన సినిమా గురించే ప్రస్తావించడంతో.. ఎన్టీఆర్ అసహనానికి లోనయ్యాడు. ఆరోగ్యం బాగాలేక.. చిరాగ్గా ఉండటంతో.. అలా రియాక్టయ్యాడు తప్ప తను కూడా కావాలని చేసింది కాదు అటున్నారు నెటిజనులు. మరి నిజంగానే ఎన్టీఆర్.. ఆ రేంజ్‌లో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అంటారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.