హీరో అల్లు అర్జున్ పేరు చెప్పగానే పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే గతేడాది రిలీజైన ‘పుష్ప’, అంతకు ముందు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక బన్నీ తమ్ముడిగా శిరీష్ కూడా చాలామందికి తెలుసు. హీరోగా ఇప్పటికే పలు చిత్రాలు చేసినప్పటికీ.. కొన్ని హిట్స్ మాత్రమే కొట్టాడు. ఇక దాదాపు మూడేళ్ల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘అలీతో సరదాగా’ టాక్ షోకి కూడా వచ్చి.. ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తండ్రి అల్లు అరవింద్ నిర్మాత, అన్నయ్య అల్లు అర్జున్ హీరో. అలా ‘గౌరవం’ సినిమాతో అల్లు శిరీష్ హీరోగా మారిపోయాడు. దీని తర్వాత ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి చిత్రాలతో హిట్స్ కొట్టాడు. ఒక్క క్షణం, ఏబీసీడీ సినిమాలు కూడా చేశారు. 2019 తర్వాత శిరీష్ హీరోగా చేసిన మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ‘ఆలీతో సరదాగా’ టాక్ షోకి వచ్చిన శిరీష్.. తన ఫస్ట్ చిత్రం గురించి మాట్లాడాడు. అది 98 శాతం మందికి నచ్చలేదని, ఒకవేళ ఆ మూవీ బాగుందని ఎవరైనా చెబితే మాత్రం కచ్చితంగా హ్యాపీగా ఫీలవుతానని శిరీష్ అన్నాడు.
అలానే తన కొత్త సినిమాలోని లిఫ్ట్ లో ముద్దు సీన్ గురించి అలీ, శిరీష్ ని అడిగాడు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. యూత్ కి ఇదంతా చాలా మూములు విషయమని ముద్దు సన్నివేశం గురించి అల్లు శిరీష్ చెప్పాడు. ఇది సింగిల్ టేక్ లో అయిందా లేదా ఎన్ని టేకులు అయిందని అలీ అడగ్గా.. ఏం చెప్పాలో తెలీక శిరీష్ తల పట్టుకున్నాడు. ఇక ‘పుష్ప’ రిలీజ్ సమయానికి తాను ముంబయిలో ఉన్నానని.. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకుంటుంటే.. తనకు చాలా హై ఇచ్చిందని శిరీష్ చెప్పాడు. అలానే ఎవ్వరికీ చెప్పని సీక్రెట్స్ బన్నీ నీకు చెప్తాడట కదా అని అలీ అడగ్గా.. శిరీష్ అవునని సమాధానమిచ్చాడు. వదిన(అల్లు స్నేహ) తనకు గన్ పెట్టి అడిగినా సరే అవి బయటపెట్టనని నవ్వుతూ సమాధానమిచ్చాడు.