తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా తాను ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అల్లు అర్జున్-స్నేహారెడ్డికి అర్హ, అయాన్ లు జన్మించారు. ఈ చిన్నారులు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ సతీమణి స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు.
ప్రస్తుతం అల్లు అర్హ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బన్నీ తనయుడు అయాన్.. మెగా మేనమామ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమాలోని పాటకు తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. అయాన్ బాక్సింగ్ గ్లౌజెస్ తొడుక్కొని.. వరుణ్ తేజ్ చేసే వర్కవుట్ విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరుణ్ తేజ్ చిత్రంలో బాక్సర్ అయ్యేందుకు ఎంతగా కష్టపడ్డాడో అయాన్ తన స్టైల్‌లో చూపించాడు.
వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్ర ప్రమోషన్ లో అయాన్ ఇలా భాగమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలో అయాన్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ ‘గని’ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నఈ చిత్రం డిసెంబర్ 3 న విడుదల కానుంది.
Here’s the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani
▶️ https://t.co/UajbgPK3Dh @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/HwR0Gt4g13
— BA Raju’s Team (@baraju_SuperHit) November 8, 2021