ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చాలామంది విషెస్ చెబుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.
‘పుష్ప 2’ టీజర్, బన్నీ ఫస్ట్ లుక్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే డిస్కషన్ అంతా దీని గురించే. మూడు నిమిషాల టీజర్ లో ఉన్నది ఓ ఎత్తయితే.. చివర్లో బన్నీ-పులి మధ్య వచ్చే సీన్ అయితే నెక్స్ట్ లెవల్ ఉంది. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఆ డైలాగ్ ఇంకా గూస్ బంప్స్ తెప్పిస్తూనే ఉంది. లేడీ గెటప్ లో ఉన్న బన్నీ ఫస్ట్ లుక్ అయితే అందరికీ మెంటలెక్కించేస్తోంది. ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే. దీంతో స్టార్ సెలబ్రిటీల దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ విషెస్ చెబుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం మాత్రం స్పెషల్ గా కనిపించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య ఇష్యూస్ ఉన్నాయని బయట రకరకాలుగా అనుకుంటున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే లోనూ బన్నీ కనిపించకపోయేసరికి అది నిజమేనని నెటిజన్స్ భావించారు. కానీ బన్నీ హైదరాబాద్ లో లేకపోవడం వల్లే పార్టీకి అటెండ్ కాలేకపోయారని అతడి భార్య స్నేహారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ బర్త్ డే వచ్చేసింది. మరి మెగాఫ్యామిలీ నుంచి ఎవరైనా ట్వీట్ చేస్తారా లేదా అని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే విష్ చేసేసరికి అంతా కామ్ అయిపోయారు. అలానే బయట వస్తున్న రూమర్స్ చిరంజీవి ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేసినట్లు అయింది.
‘హ్యాపీ బర్త్ డే డియర్ బన్నీ. ‘పుష్ప 2′ ఫస్ట్ లుక్ రాక్స్. ఆల్ ది బెస్ట్’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో మెగా-అల్లు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ టీజర్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చి వండర్స్ క్రియేట్ చేసింది. అలాంటిది ఇప్పుడు సీక్వెల్ రిలీజ్ కు ఏడాది ముందే ఓ రేంజ్ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ రికార్డులని ‘పుష్ప 2’ బద్ధలుకొట్టడం పక్కా అనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే బన్నీ బర్త్ డేకి చిరు ట్వీట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Happy Birthday Dear Bunny @alluarjun !
Many Happy Returns!! 💐💐Also The First Look of #Pushpa2TheRule Rocks!
All The Very Best!!— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2023