మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి బావ మరిదిగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్.. టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా.. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు నిర్మిస్తూ.. ఇతర భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తూ.. సక్సెస్ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. తాజాగా ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద కాంతార చిత్రం విడుదల చేశారు. ఇక అల్లు అరవింద్ కుమారులు అల్లు అర్జున్, శిరీష్ హీరోలుగా రాణిస్తున్నారు. అలానే ఆహా అనే ఓటీటీ ప్లాట్‌ఫాంను తీసుకువచ్చి.. అన్‌స్టాపబుల్, డ్యాన్స్ ఐకాన్, సింగింగ్ కాంపిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రేక్షకుల అభిమానాలు సంపాదించుకుంటుంది.
ఇక తాజాగా అల్లు అరవింద్.. హీరోయిన్ అనుపమ పరేమశ్వరన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. హీరోయిన్ గురించి ఓ ప్రొడ్యూసర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ మధ్యకాలంలో చాలా అరుదు అంటున్నారు నెటిజనులు. ఈ సన్నివేశం ఎక్కడ చోటు చేసుకుంది అంటే.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘18 పేజెస్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తికేయ-2 చిత్రం ద్వారా.. నిఖిల్.. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జోడి.. 18 పేజెస్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘కుమారి 21ఎఫ్’ సినిమాకు దర్శకత్వం వహించిన సూర్యప్రతాప్ పల్నాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాలోని ‘ఏడురంగుల వాన’ అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. అల్లు అరవింద్.. ఈ పాటను విడుదల చేశారు. ‘కార్తికేయ 2’ సినిమా తరువాత అదే జోడీతో ఈ ‘18 పేజెస్’ సినిమా రావడం సంతోషంగా ఉందన్నారు అల్లు అరవింద్. హీరో నిఖిల్ చాలా కష్టపడి పని చేస్తాడని తెలిపాడు అల్లు అరవింద్. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించారు. అనుపమ నటన చాలా సహజంగా ఉంటుందని ప్రశంసించారు. అనుపమ నటన అంటే తనకు ఎంతో ఇష్టమని.. అనుపమను చూసినప్పుడల్లా ఆమెలాంటి కూతురు ఉంటే బాగుండేదని అనిపిస్తుందని అన్నారు అల్లు అరవింద్. హీరోయిన్ను ఉద్దేశించి.. ఓ ప్రొడ్యూసర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా గ్రేట్ అంటున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.