Annu Kapoor: మన్మధుడు సినిమాలో నాగార్జున, సోనాలీ బింద్రే పారిస్ పోయిన తర్వాత బ్రహ్మానందంతో ఓ సీన్ ఉంటుంది. ఓ చోట బ్రహ్మానందం, నాగార్జునలను ఫొటో తీయటానికి సిద్దమవుతూ హీరోయిన్ తన భుజానికి ఉన్న బ్యాగు తీసి కిందపెడుతుంది. అప్పుడు నాగార్జున ‘‘ఏయ్! ఏంటిది?.. హీరోయిన్లు బట్టలు వదిలేసినట్లు ఎక్కడపడితే అక్కడ బ్యాగులు వదిలేస్తున్నావ్’’ అని అంటాడు. దానికి బ్రహ్మానందం ‘‘ఎందుకు సార్ అంత టెన్షన్. ఇదేమన్నా ఇండియా అనుకున్నారా?.. జేబుకు తెలియకుండా పర్సు కొట్టేయడానికి. పారిస్ సార్! ఈ బ్యాగు ఇక్కడపెట్టి సంవత్సరం తర్వాత తిరిగొచ్చి చూడండి. ఇది ఇక్కడే ఉంటుంది’’ అంటాడు. తర్వాత హీరోయిన్ ఫొటో తీస్తుంది. ఆ వెంటనే ‘‘ఫొటో వచ్చింది’’ అంటుంది. అప్పుడు బ్రహ్మానందం ‘‘బ్యాగు పోయింది’’ అంటాడు.
ఈ సినిమాలో బ్రహ్మానందం బ్యాగు కొట్టేసినట్లు.. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడి బ్యాగును కూడా కొట్టేశారు కొందరు దొంగలు. ఫ్రాన్స్ టూరులో ఉన్న ఆయన బ్యాగును కొట్టేసి ఇబ్బందుల పాలు చేశారు. ప్రముఖ నటుడు అన్ను కపూర్ ప్రస్తుతం ఫ్రాన్స్ టూరులో ఉన్నారు. ఓ చోట ట్రైన్లో దొంగలు ఆయన బ్యాగు కొట్టేశారు. అందులో పెద్ద మొత్తంలో డబ్బులు, క్రెడిట్ కార్డులు, ఓ ఐపాడ్ ఉన్నాయి. ఈ ఘటనపై అన్ను కపూర్ స్పందించారు.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోయర్లకు ఓ హెచ్చరిక జారీ చేశారు. ‘‘ నేను ఇప్పుడే పారిస్కు చేరుకున్నాను. దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఇక్కడి జనం కంప్లైంట్ చేయటానికి నాకు సహాయం చేస్తున్నారు. మీరు ఫ్రాన్స్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి దొంగలు చాలా తెలివైన వాళ్లు. నాకు చాలా పెద్ద ఘటన జరిగింది. దేవుడి దయవల్ల పాస్పోర్టు నా దగ్గరే ఉండిపోయింది. డబ్బులు, కార్డులు పోయాయి’’ అంటూ ఆవేధన వ్యక్తం చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chinmayi Sripada: సరోగసి వార్తలపై స్పందించిన సింగర్ చిన్మయి!