“చాలా బాగుంది” మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక. ఆ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆమె.. కేవలం అర డజన్ సినిమాలు మాత్రమే చేసింది. అయితే మాత్రం గ్లామర్ గాళ్ గా మంచి పేరు తెచ్చుకుంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన హీరోయిన్ మాళవిక తమిళంలో మంచి పేరు తెచ్చుకుంది. కన్నడంలో ఒక సినిమాలో మాత్రమే నటించింది. తెలుగులో తాను నటించిన మొదటి
చిత్రంలోని రేప్ సీన్ బాగా ఇబ్బంది పెట్టిందన్నారు నటి మాళవిక. తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘకాలం పాటు దూరంగా ఉన్న ఆమె”ఆలీతో సరదాగా” షోలో పాల్గొని.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చదవండి: ఎత్తుకెళ్లిన దేవుడి విగ్రహాలు తిరిగి వెనక్కి ఇచ్చిన దొంగలు!
“చాలా బాగుంది మూవీ షూటింగ్ సమయంలో శ్రీకాంత్ నామీద కోపంతో షూటింగ్ మధ్యలో వెళ్లిపోయారు. రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయంలో నేను కాస్త ఇబ్బంది పడ్డాను. ఆసీన్ నాకు అంత కంఫర్ట్ గా లేదు. “సీయు ఎట్ 9″అనే హిందీ సినిమాలో ఎక్స్ పోజ్ చేసినందుకు నా కుటుంబ సభ్యులు నా మీద చాలా కోప్పడ్డారు. అలా నటించినందుకు తర్వాత నేను బాధపడ్డాను. అప్పట్లో నాగార్జున అంటే ఇష్టం, ఇప్పుడైతే విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. సూపర్ స్టార్ రజనీకాంత్ తో చంద్రముఖిలో నటించేటప్పుడు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ లతో నటించేటప్పుడు నేను చాలా భయంగా ఫీల్ అయ్యాను” అని మాళవిక తెలిపారు.
తెలుగు సినిమాలు చూస్తుంటారా? అని ఆలీ అడిగిన ప్రశ్నకు. ఇటీవల “పుష్ప” సినిమా చూశానని, అందులోని “ఊ అంటావా..”అనే సాంగ్ కి అవకాశం వస్తే తప్పకుండా ఓకే చెప్పేదాన్ని అని నటి మాళవిక అన్నారు. ఈవీవీ గారితో పని చేయడం ఎలా ఉంది? అని ఆలీ అడిగితే.. చాలా సూపర్‌గా ఉంది.. కాకపోతే ఆ రేప్ సీన్ మాత్రం నాకు నచ్చలేదు.. చాలా డిస్టర్బ్‌గా అనిపించింది.. నెగెటివ్ కారెక్టర్ అని మాళవిక చెప్పుకొచ్చింది. మరి.. చాన్నాళ్ల తరువాత కెమెరా ముందుకి వచ్చి హీరోయిన్ మాళవిక చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.