SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » 20 Years Of Khadgam Movie Which Is Best Film In Patriotism

హిందూ-ముస్లిం కాదు.. మేమంతా భారతీయులమని చాటిన ‘ఖడ్గం’కి 20 ఏళ్ళు!

    Published Date - Tue - 29 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
హిందూ-ముస్లిం కాదు.. మేమంతా భారతీయులమని చాటిన ‘ఖడ్గం’కి 20 ఏళ్ళు!

సినిమా అనేది అన్ని రంగులు కలిపి ఓ మంచి పెయింటింగ్ ని రెడీ చేయడం లాంటిది. ఒక్కో రంగులో ఒక్కో ఎమోషన్.. ఆ ఎమోషన్స్ వెనుక మర్చిపోలేని సంఘటనలు.. వాటిని అల్లుకొని బంధాలు, బాధ్యతలు.. వీటికి తోడు జీవిత లక్ష్యాలు.. ఇన్ని రంగులను కలగలిపి అందమైన సినిమా పెయింటింగ్ రెడీ చేసి.. థియేటర్స్ అనే ప్రదర్శనశాలలో ప్రదర్శిస్తే.. ఎలా ఉందో చూసి ఫలితం డిసైడ్ చేసేవారే ప్రేక్షకులు. అలా కృష్ణవంశీ అనే దిగ్గజ దర్శకుడు.. ‘ఖడ్గం’ అనే అందమైన పెయింటింగ్ ని 2002 నవంబర్ 29న థియేట్రికల్ రిలీజ్ చేశాడు. అంతే.. ఖడ్గం సినిమాని థియేటర్లలో చూసిన ప్రేక్షకులలో పూనకాలు మొదలయ్యాయి.

వావ్.. ఇది కదా సినిమా.. ఇది కదా మనుషుల్లో దేశభక్తిని రగిలించే విధానం.. ఇవి కదా మనసులను కదిలించే భావోద్వేగం.. ఇదే కదా జీవిత లక్ష్యం కోసం రిస్క్ చేయడం.. అని ఓ రేంజిలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా ఖడ్గం. వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు.. ప్రతి సినిమాలో వాల్యూ సిస్టమ్ ని ఫాలో అయ్యే దర్శకుడు.. లవ్, ఫ్యామిలీ, నక్సలిజం ఇలా విభిన్న అంశాలను టచ్ చేసిన అదే దర్శకుడు కృష్ణవంశీ. ఒక్కసారి దేశభక్తి అనే పాయింట్ తో భిన్నమతాల ఎమోషన్స్ ని ఏకం చేసి తీసిన చిత్రమే.. ఈ ఖడ్గం. ఈ సినిమాలో హైలైట్స్.. ఒకటీ, రెండూ అని చెప్పే వీలు లేకుండా.. అసలు సినిమానే హైలెట్ అని గొప్పగా మాట్లాడుకునేలా చేసిన సినిమా ఖడ్గం.

నేటికి 29 నవంబర్ 2022కి ఖడ్గం సినిమా విడుదలై 20 సంవత్సరాలు. ప్రతి రిపబ్లిక్ డేని, ప్రతి ఇండిపెండెన్స్ డేని ఎన్నో ఏళ్లుగా ఖడ్గం సినిమాతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు.. ఇది ఒక సినిమానే కదా! అనిపించవచ్చు. ఖడ్గం సినిమాకి ముందు, తర్వాత దేశభక్తి, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ పై ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు. కానీ.. ఎన్నేళ్ళైనా ఖడ్గం స్థానాన్ని మాత్రం ఏ సినిమా కదిలించలేదు. ఎందుకంటే.. ఖడ్గంలో భిన్నమతాల ఏకత్వం ఉంది.. స్వచ్ఛమైన ప్రేమ ఉంది.. కష్టపడే మనస్తత్వాలు ఉన్నాయి.. అన్నింటికీ మించి మనమంతా భారతీయులం అని చాటి చెప్పే ఔన్నత్యం అందులో ఉంది.

ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ నుండి చిన్న క్యారెక్టర్స్ అన్నీ కథను ఎలివేట్ చేసేవే. ఎక్కడా ఇది అనవసరం అనిపించకుండా గొప్ప సినిమాని మనకు అందించినందుకు ముందుగా దర్శకుడు కృష్ణవంశీకి హ్యాట్సాఫ్ చెప్పాలి. థియేటర్స్ లో చూస్తే ఎన్నో సినిమాలు.. ఔరా అనిపించవచ్చు.. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే హృదయాన్ని బరువెక్కించి, మనసు పొరల్లో ఎక్కడో మూలన పడిపోయిన దేశభక్తిని నిద్రలేపుతుంటాయి. అలాంటి సినిమాలలో ఖడ్గం ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. ఇందులో మాస్, క్లాస్, డ్రామా ఇలా అన్ని ఉన్నాయి.. అందరూ కలిసి అన్ని ఎమోషన్స్ ని అనుభూతి చెందవచ్చు. ప్రతి ఎమోషన్ ఓ రంగులా మనస్సులో పాతుకుపోతుంది.

ఖడ్గం అనగానే.. మనకు ముందుగా గుర్తొచ్చేది కోటి(రవితేజ), రాధాకృష్ణ(శ్రీకాంత్), అంజాద్ భాయ్(ప్రకాష్ రాజ్), సీతామాలక్ష్మి(సంగీత), స్వాతి(సోనాలి బింద్రే), అజర్(షఫీ) క్యారెక్టర్స్. సినిమా మొదలై.. ముగిసేలోపు ఎన్నో ఎమోషన్స్ ని టచ్ చేస్తూ ఈ పాత్రలు మనతో పాటు జర్నీ చేస్తుంటాయి. కోపం.. అమాయకత్వం.. ద్వేషం.. నిరాశ.. ఎదురుచూపు.. బాధ.. ఇలా ఒక్కో క్యారెక్టర్ ఒక్కో ఎమోషన్ ని క్యారీ చేస్తూ.. మనల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి. దేశభక్తి విషయానికి వచ్చేసరికి రక్తం మరిగేలా చేస్తాయి. సినిమాలో ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి.. ఈ క్యారెక్టర్స్ అన్నిటి వెనుక ఓ బలమైన ఎమోషన్స్.. “స్నేహం – దేశం”.

హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా సర్వమతాలన్నీ ఒకే ఎమోషన్ ని రిప్రెజెంట్ చేస్తుంటాయి.. అదే ఇండియా. ఒక్క సినిమా అవకాశం కోసం కోటి, సీతామాలక్ష్మి పడే పాట్లు.. ఓవైపు ప్రేయసిని కోల్పోయి, పాకిస్తాన్ పై రగిలిపోయే రాధాకృష్ణ.. ఆటో డ్రైవర్ గా స్నేహానికి ప్రాణమిచ్చే అంజాద్ భాయ్ పాత్రలను అంత ఈజీగా మర్చిపోగలమా..! కృష్ణవంశీ ఎంచుకున్న పవర్ ఫుల్ స్క్రిప్ట్ కి.. అద్భుతమైన డైలాగ్స్ రాసి ఎలివేట్ చేసిన ఉత్తేజ్.. ప్రతి ఎమోషన్ కి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కాప్చర్ చేసిన సినిమాటోగ్రాఫర్ భూపతి – ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ లను గుర్తుచేసుకోకుండా ఉంటామా..! సినిమాలో ప్రతి ఎమోషన్ కి తన మ్యూజిక్ తో, సాంగ్స్ తో ప్రాణం పోసిన దేవి శ్రీప్రసాద్ ని అభినందించకుండా ఉండగలమా!

చివరిగా ఇండియాలో పుట్టి పాకిస్తాన్ కోసం పనిచేసే తీవ్రవాది అజర్ క్యారెక్టర్ ని ద్వేషించకుండా ఉంటామా! అమ్మ ప్రేమ.. ప్రేయసిపై ప్రేమ.. దేశంపై ప్రేమ.. దేవుళ్లపై ప్రేమ.. స్నేహితులపై ప్రేమ.. ఇలా ఎన్నో.. 20 ఏళ్ళ క్రితమే ఈ ఖడ్గంలో భద్రంగా అమర్చాడు దర్శకుడు కృష్ణవంశీ. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని ఏదొక క్యారెక్టర్ లో తమ జీవితాన్ని చూసుకునేలా తీర్చిదిద్దిన ఘనత కృష్ణవంశీది.. అయితే.. ఇలాంటి స్క్రిప్ట్ ని గట్స్ తో నిర్మించిన సుంకర మధుమురళీకి మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఆ రోజుల్లో ఓవైపు ఫ్యాక్షనిజం.. నక్సలిజం.. తీవ్రవాదం.. అల్లర్ల మధ్య ఖడ్గం విడుదలై బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన రోజు ఇది. 5 నంది అవార్డులు, 3 ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకుందని.. గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమానే ఈ ‘ఖడ్గం’.

Tags :

  • 20 Years of Khadgam
  • Khadgam
  • Krishna Vamsi
  • Movie News
  • Raviteja
  • Srikanth
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశీష్ విద్యార్థి ఓ రియల్ హీరో! ఉదయ్ కిరణ్ లాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన కథ!

ఆశీష్ విద్యార్థి ఓ రియల్ హీరో! ఉదయ్ కిరణ్ లాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన కథ!

  • ఈ చిన్నోడ్ని గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో తోపు నటుడు..

    ఈ చిన్నోడ్ని గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో తోపు నటుడు..

  • వీడియో: ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు తలపట్టుకున్న హీరోయిన్‌ నందిత శ్వేత

    వీడియో: ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు తలపట్టుకున్న హీరోయిన్‌ నందిత శ్వేత

  • ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత మృతి..

    ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత మృతి..

  • ఆ హీరోలు అమ్మాయిలను ట్రాప్ చేయడానికే ఉంటారు.. అర్చన కామెంట్స్ వైరల్..

    ఆ హీరోలు అమ్మాయిలను ట్రాప్ చేయడానికే ఉంటారు.. అర్చన కామెంట్స్ వైరల్..

Web Stories

మరిన్ని...

సింగర్‌ వాణీ జయరాం కన్నుమూత!
vs-icon

సింగర్‌ వాణీ జయరాం కన్నుమూత!

చూపులతోనే మోహం పెంచుతున్న మాళవిక మోహనన్..
vs-icon

చూపులతోనే మోహం పెంచుతున్న మాళవిక మోహనన్..

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ పెళ్లి ఫొటోలు
vs-icon

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ పెళ్లి ఫొటోలు

చీరలోనూ చిలిపి అందాలతో అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..
vs-icon

చీరలోనూ చిలిపి అందాలతో అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..

తాజా వార్తలు

  • 85 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకున్న 24 ఏళ్ల యువతి.. ఇదేం ప్రేమరా దేవుడా!

  • హృతిక్ రోషన్ టాలీవుడ్ ఎంట్రీ… మైత్రీ-హరీశ్ కాంబోలో హీరోగా?

  • హైదరాబాద్ లో అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ పై పెదవి విరుస్తున్న సామాన్య జనాలు

  • అడగ్గానే యాప్ లకు పర్మిషన్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

  • వీడియో: ‘వీరసింహారెడ్డి’ హనీరోజ్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!

  • ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ‘చక్ దే’ నటి.. ఫొటోస్ వైరల్!

  • అదృష్టం అంటే ఈమెదే! సరదాగా లాటరీ కొంటే ఏకంగా రూ.290 కోట్లు గెలిచింది..!

Most viewed

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

  • సూర్య.. నువ్వు తోపు ప్లేయర్‌వి కావచ్చు.. కానీ ఇలా చేయడం తప్పు!

  • వేశ్యలను మరిగిన భర్త.. వ్యభిచార గృహంలో చేరిన భార్య!

  • ఫేస్‌బుక్‌ ప్రేమ.. అద్దె ఇంట్లో శవమై కనిపించిన యువతి!

  • అదానీ గ్రూపును కుదేలు చేసిన హిండెన్ బర్గ్ ఫౌండర్ ‘నాథన్ ఆండర్సన్’ చరిత్ర ఇదే..!

  • అజిత్ ‘తెగింపు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్! స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam