వనితా విజయకుమార్.. ఓ రెండేళ్ల క్రితం వరకు ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకి దేవి సినిమా గుర్తుకి వచ్చేది. కానీ.., తరువాత కాలంలో వనితా విజయకుమార్ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటన కారణంగా ఆమెని ప్రేక్షకులు గుర్తు పట్టే విధానమే మారిపోయింది. ఇప్పుడు వనితా విజయకుమార్ అంటే ఓ సంచలన నటి. చుట్టూ వివాదాలు, వరుస పెళ్లిళ్లు, వెను వెంటనే విడాకులు ఇవన్నీ కూడా వనితా విజయకుమార్ స్థాయిని అమాంతం పడిపోయేలా చేశాయి. కానీ.., నటిగా మాత్రం ఆమె టాలెంట్ ని తక్కువ చేసి చూడలేము. ఓ మంచి పాత్ర దక్కితే ఇప్పటికీ విజృంభించి నటించగల సామర్ధ్యం ఆమె సొంతం. తాజాగా వనితా విజయకుమార్ అలీతో సరదాగా పోగ్రామ్ గా కి గెస్ట్ గా విచ్చేసింది.
ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఇందులో వనితా విజయకుమార్ పలు విషయాలపై మనసు విప్పి మాట్లాడింది. ” దేవి సక్సెస్ తరువాత నాకు తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ.., అప్పుడు నేను పీకల్లోతు ప్రేమలో ఉండి.. అవన్నీ చేజార్చుకునాన్ను. ఇక దేవి షూటింగ్ సమయంలో నన్ను నిజంగానే పాము కాటేసింది. అయినా.., బతికి బయట పడ్డాను” అంటూ ఆనాటి సంగతులను చెప్పుకొచ్చింది వనితా విజయకుమార్.
పెళ్లి అనేది తన వ్యక్తిగతమని, నాలుగు కాకుంటే.., నలబై చేసుకుంటానని అలీకే కౌంటర్ వేసింది ఈ సీనియర్ నటి. ఇదే సమయంలో తన తండ్రితో ఏర్పడ్డ గొడవ గురించి కూడా ఓపెన్ అయ్యి, కన్నీరు పెట్టింది. ఇక ఇదే కార్యక్రమంలో తన ఫేవరేట్ హీరో ఎవరో కూడా చెప్పుకొచ్చింది వనితా విజయకుమార్. “ఒకప్పుడు నేను నాగార్జున ఫ్యాన్. ఇప్పుడు మాత్రం జూనియర్ యన్టీఆర్ అంటే పిచ్చి. ఆయనతో కలసి ఒక్క సీన్ లో యాక్ట్ చేసిన చాలని వనితా విజయకుమార్ చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది.