రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ బ్రహ్మాస్త్ర. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కి ముందు నుండే ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై అలియా భట్ స్పందించారు. ఈ విషయంలో ర్యాష్ గా కాకుండా చాలా సున్నితంగా వ్యవహరించారు అలియా భట్. బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అసలు బాయ్ కాట్ గురించి ఆలోచించడం లేదని, బ్రహ్మాస్త్ర సినిమా విషయంలో ఎలాంటి నెగిటివిటీ లేదని, అంతటా పాజిటివిటీ ఉందని అలియా భట్ వ్యాఖ్యలు చేశారు.
దీంతో అలియా భట్ తెలివైనదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు.. నచ్చితే చూడండి, లేదంటే లేదు అంటూ ఘాటుగా స్పందించారు. ఇంకొంతమంది అయితే దీని వల్ల మాకు జరిగే నష్టం ఏమీ లేదన్నట్టు వ్యాఖ్యలు చేసి చేతులు కాల్చుకున్నారు. వీళ్ళు చేసిన కామెంట్స్ తో నెటిజన్లు వారి సినిమాలని బాయ్ కాట్ చేస్తూ ఇంకా ట్రెండ్ చేశారు. దీని వల్ల వారి సినిమాలకి తీవ్ర నష్టం వాటిల్లింది. రీసెంట్ గా అలియా భట్ కూడా.. ‘నేను నచ్చితే చూడండి, నచ్చకపోతే సినిమా చూడడం మానేయండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Alia Bhatt Reacts To Boycott Trend Yet Again #Koimoi #bollywood #aliabhatt #Brahmastra #boycottrendhttps://t.co/gdUDKQanvX
— Koimoi.com (@Koimoi) September 8, 2022
అలియా గతంలో చేసిన కామెంట్స్: Alia: ‘బాయ్ కాట్’ ట్రెండ్ పై అలియా భట్ అసహనం.. వీడియో వైరల్!
అయితే మరి ఇప్పుడు ఏమైందో ఏమో గానీ సడన్ గా బాయ్ కాట్ ట్రెండ్ విషయంలో ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పుండు మీద కారం జల్లినట్టు ఈ నెటిజన్స్ ని గెలికే కొద్దీ రెచ్చిపోతారు కాబట్టి.. పెద్దగా పట్టించుకోకపోతే మనల్ని పట్టించుకోరని అలియా భట్ బాగా గ్రహించారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రణబీర్ కపూర్ కూడా భార్య రూట్లోనే వెళ్తూ.. మంచి కంటెంట్ ఉంటే సినిమాని ఆదరిస్తారని, లేకపోతే ఎవరూ ఆదరించారంటూ కామెంట్స్ చేశారు. మరి నెటిజన్లు వీరి మాటలని పాజిటివ్ గా తీసుకుని బ్రహ్మాస్త్ర మూవీని బాయ్ కాట్ చేయకుండా ఊరుకుంటారో లేదో చూడాలి. మరి బాయ్ కాట్ ట్రెండ్ పై తెలివిగా స్పందించిన అలియా భట్, రణబీర్ కపూర్ లపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.