మెగావారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. తన తండ్రిలా అలరిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ RRRతో అంతకుమించిన పాపులారిటీ సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. హాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలిచి, యూనివర్సల్ స్టార్ అనిపించుకున్నాడు. హాలీవుడ్ మీడియాలోనూ చరణ్ గురించి స్పెషల్ గా ఓ ఆర్టికలే పడిందంటే చరణ్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న RC15 షూటింగ్ యమ స్పీడుగా జరుగుతోంది. చివరిదశలో ఉంది. డైరెక్టర్ శంకర్ తో సినిమాలు అంటేనే సోషల్ ఎలిమెంట్స్ ని జతచేస్తూ, విజువల్ వండర్ గా తెరకెక్కిస్తారు. ఈ మధ్య కాలంలో శంకర్ లో అది మిస్ అయింది. మళ్లీ ఇప్పుడు చరణ్ సినిమాతో పాత శంకర్ ని చూడబోతున్నట్లు అనిపిస్తోంది. ఇందులో చరణ్.. వ్యవస్థని ప్రశ్నించే పాత్రలో కనిపిస్తారని.. పలువురు నటీనటులు ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో బయటపెట్టారు. RC15 ప్రాజెక్టుతో పాటు యాడ్స్ షూటింగులతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కి ఈ వీకెండ్ కాస్త సమయం దొరికింది. ఇక లేట్ ఎందుకు అన్నట్లు అక్క చెల్లెలు, మేనకోడళ్లు, స్నేహితులతో కలిసి ట్రిప్ వేశాడు. ఈ ట్రిప్ మిస్ అయిన ఉపాసన.. ఓ ఫొటోని పోస్ట్ ట్వీట్ చేసి, 'రామ్-రైమ్ మిస్సింగ్ యూ' అని రాసుకొచ్చింది. రామ్ చరణ్ కొత్త ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: యాడ్ కోసం రూ. 7 కోట్లు తీసుకున్న రామ్ చరణ్ Ram & Rhyme - I’m FOMO ! Missing u already ❤️@AlwaysRamCharan https://t.co/ux0VWWlXtJ pic.twitter.com/JpOvvLPZgb — Upasana Konidela (@upasanakonidela) September 9, 2022 Latest pics #RamCharan @AlwaysRamCharan #RC15 pic.twitter.com/SvVTNypSt8 — Ram (@HereFoRamCharan) September 9, 2022