టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు అలీ. కమెడియన్‌గా మాత్రమే కాక.. హీరోగా కూడా నటించి.. మెప్పించాడు. తాజాగా అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి సినిమాతో కొన్ని రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అలీ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు అలీ. ఈ క్రమంలో తాజాగా అలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. త్వరలో అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం త్వరలోనే జరగబోతుంది. ఇప్పటికే నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక కుమార్తె పెళ్లికి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని, మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు అలీ దంపతులు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి తెగ వైరలయ్యియి.
అలీ, జుబేదా అలీ దంపతుల కుమార్తె ఫాతిమా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అలీ కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలీ సహనటులు బ్రహ్మానందం, సాయి కుమార్ సహా పలువురు సినీ ప్రముఖులు, బంధువుల సమక్షంలో.. ఫాతిమా నిశ్చితార్థం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి తేదీ దగ్గర పడుతున్న తరుణంలో సినీ, రాజకీయ ప్రముఖులను వివాహానికి ఆహ్వానించేందుకు అలీ దంపతులు.. ప్రముఖులను కలుస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తొలి కార్డును ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ఇచ్చి.. పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఫాతిమా హాల్దీ వేడుక ఘనంగా నిర్వహించారు అలీ దంపతులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిల్లో అలీ, జుబేదా దంపతులు, వారి పిల్లలు, బంధువులు.. ముఖానికి పసుపు పూసుకుని.. ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అతి కొద్ది మంది బంధువులు సమక్షంలో.. ఈ వేడుక జరిగినట్లుగా అర్థం అవుతోంది. నిశ్చితార్థం, హల్దీ వేడుకలకు కేవలం అలీ కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరు కాగా.. ఇక వివాహానికి రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు హాజరు కానున్నారని.. వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక కుమార్తె పెళ్లికి సంబంధించి జుబేదా తన యూట్యూబ్ చానెల్‌లో వీడియోలు పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతానికి ఫాతిమా హల్దీ వేడుక ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.