ఈవెంట్లలో డ్యాన్సులు చేసి డబ్బులు సంపాదించటం బాలీవుడ్ హీరోలకు కొత్తేమీ కాదు. స్టార్ హీరోలు కూడా పెళ్లిళ్లు, ఇతర ఈవెంట్లలో పాల్గొని డ్యాన్స్‌లు వేస్తూ ఉంటారు. ఒక్కోసారి అతిగా డ్రెస్ వేసుకుని విమర్శలకు గురి అవుతూ ఉంటారు.
సౌత్ హీరోలతో పోల్చుకుంటే బాలీవుడ్ హీరోలకు కొంచెం స్వేచ్ఛ ఎక్కువ. వారు ఏం చేసినా చెల్లుతుంది అన్న ధోరణిలో ఆలోచిస్తూ ఉంటారు. డబ్బుకోసం పెళ్లిళ్లలో డ్యాన్సులు వేయటం.. ఈవెంట్లు చేయటం వంటివి బాలీవుడ్ వాళ్లకు మాత్రమే చెల్లింది. 1000 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోలు కూడా పెళ్లిళ్లు, ఈవెంట్లలో డ్యాన్సులు వేస్తూ ఉంటారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి వారు కూడా ఈవెంట్లలో డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇలాంటి ఈవెంట్లలో వారు వేసుకునే డ్రెస్సు వారిని ట్రోల్స్‌కు గురిచేస్తూ ఉంటాయి. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తన డ్రెస్సు కారణంగా ట్రోల్స్ గురవుతున్నారు.
నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారాలా? అని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఆమెరికా పర్యటనలో ఉన్నారు. ఎంటర్‌టైనర్ పేరిట నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు నోరా ఫతేహీ, సోనమ్ బజ్వా, మౌనీ రాయ్, దిశపటానీ వంటి వారు కూడా ఆయనతో పాటు టూర్‌లో ఉన్నారు. ఈ టూర్‌లో భాగంగా అక్షయ్‌తో పాటు మిగిలిన వారు డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు ఇస్తున్నారు. మార్చి 3వ తేదీన అట్లాంటాలోని గ్యాస్ సైత్ ఎరినాలో మొదటి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ వీడియోల్లో అక్షయ్ కుమార్ లంగా వేసుకుని ఉన్నారు. ఆ లంగాలోనే ‘మై ఖిలాడీ.. తు అనారీ ’ పాటకు డ్యాన్స్ చేశారు. అక్షయ్ లంగా వేసుకుని డ్యాన్స్ చేయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు స్పందిస్తూ ‘‘ ఛీ డబ్బు కోసం మరీ ఇంతలా దిగజారి డ్యాన్స్‌లు వేయాలా?’’.. ‘‘ చాలు.. ఇన్ని రోజులు ఇదే బాకీ ఉండింది’’.. ‘‘ ఎంత సినిమాల ద్వారా డబ్బులు రాకపోతే.. ఇలా లంగాలు వేసుకుని డబ్బులు సంపాదిస్తారా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, అక్షయ్ లంగా డ్యాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.